Virupaksha review in Telugu: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ నటించిన రిపబ్లిక్ చిత్రం తర్వాత ఏడాదిన్నారా గ్యాప్ తో వచ్చిన మూవీ విరూపాక్ష అవ్వడంతో దానిపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిధరమ్ తేజ సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత నటించినా తొలి చిత్రం ఇది. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం…
Virupaksha review in Telugu: మంచి హారర్ కథ నేపథ్యంతో సాగిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ ఇటువంటి తరహా చిత్రం చేయలేదు.. పైగా ఇటువంటి జానర్ లో పెద్ద హీరోల సినిమాలు చూసి కూడా చాలా కాలం అయింది. దానికి తోడు ఈ చిత్రంపై సుకుమార్ రైటింగ్ బ్రాండ్ పడడంతో మూవీ పైన అంచనాలు ఓ రేంజ్ లోనే వెళ్లాయి.
విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2023
రేటింగ్ : 3/5
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, సునీల్ తదితరులు
దర్శకులు : కార్తీక్ దండు
నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్
సంగీత దర్శకులు: అజనీష్ లోక్‌నాథ్
కథ : మంత్ర తంత్రాల బ్యాక్ గ్రౌండ్ తో సాగే ఈ స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పవచ్చు. స్టోరీ లోకి వెళితే రుద్రవనం అనే ఒక ఊరిలోని ప్రజలు క్షుద్ర పూజలు చేస్తున్నారు అన్న అనుమానంతో ఓ కుటుంబాన్ని చంపేస్తారు. భర్తతోపాటు చనిపోతున్న భార్య పుష్కరకాలం లోపు ఆ ఊరు వల్ల కాడుగా మారుతుందని శపిస్తుంది.తల్లిదండ్రులను పోగొట్టుకున్న పసిపిల్లాడిని ఊరి నుంచి దూరంగా పంపించేస్తారు. ఇది జరిగిన కొంత కాలానికి సూర్య (సాయి ధరమ్ తేజ్) తన తల్లితోపాటు ఆమె పుట్టిన ఊరు రుద్రవనానికి వస్తాడు.
Virupaksha review in Telugu: అదే ఊరిలో ఉన్న నందిని (సంయుక్త మీనన్)తో సూర్య ప్రేమలో పడడం ఆమెను ఇంప్రెస్ చేయడం కోసం తంతాలు పడడం కాస్త ఫన్నీగా సాగుతుంది. మరోవైపు ఊరిలో మనుషులు వరుసగా అనుమానాస్పద రీతిలో చనిపోతూ ఉంటారు. దీంతో ఆ ఊరిలో గందరగోళం తో పాటు ప్రజలలో విపరీతమైన భయం కూడా మొదలవుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? వారి హత్యల వెనుక రహస్యం ఏమిటి? జరిగే హత్యలకు సూర్యకు మధ్య సంబంధం ఏమిటి? తెలియాలి అంటే సినిమా హాల్లో సినిమా చూడాల్సిందే…
ప్లస్ పాయింట్స్ : స్టోరీ లైన్ చాలా పవర్ ఫుల్ గా సినిమాకి మంచి ప్లస్ పాయింట్ గా నిలిచింది. మూవీ డైరెక్టర్ కార్తీక్ దండు మూవీ ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ఎప్పటిలాగా సాయిధరమ్ తేజ తన వినూత్నమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. కొన్ని థ్రిల్లర్స్ అన్ని దేశాలలో అతని యాక్షన్ ఎంతో రియలిస్టిక్ గా మరియు ఆకట్టుకునే విధంగా ఉంది. సెకండ్ హాఫ్ లో సాగే యాక్షన్స్ సన్నివేశాలు మరియు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్ లో సాయిధరమ్ తేజ నటన చాలా బాగుంది.
హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పవచ్చు. కీలకమైన హారర్ సన్నివేశాలలో ఆమె పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. రాజీవ్ కనకాల తన పాత్రకు జీవం పోసాడు అని చెప్పవచ్చు. మిగిలిన నటీ నటులు అందరు తమ నటనతో పాత్రలకు న్యాయం చేశారు. మూవీలో హారర్ సీన్ పిక్చర్ ఓ లెవెల్ లో ఉంది.



మంచి పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టు. విజువల్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ సన్నివేశానికి తగ్గినట్టుగా అద్భుతంగా ఉన్నాయి. ఫ్రీ ఇంటర్వెల్ నుంచి కథ లో వచ్చే ట్విస్టులు చిత్రంపై ఆసక్తిని రేపడంతోపాటు నెక్స్ట్ ఏమి జరుగుతుంది అన్న ఉచ్చుకతను ప్రేక్షకులలో కలిగిస్తున్నాయి. అసలు సినిమాలో మెయిన్ విలన్ పాత్ర ఎవరు అనే టెన్షన్ అద్భుతంగా మెయింటైన్ చేశారు.
మైనస్ పాయింట్స్ : కాస్త ఆ మూవీకి రొమాంటిక్ టచ్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మంచి లాజిక్ పాయింట్స్ ని డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా కాస్త సింపుల్గా చూపించినట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు ఇంకా ఆసక్తికరంగా చిత్రీకరించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అక్కడక్కడ సినిమాలో కాస్త క్లారిటీ మిస్ అయినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ మరియు రాజీవ్ కనకాల పాత్రల మధ్య జరిగిన ట్రాక్ను మరింత బలంగా సినిమా ఇంకో లెవెల్ లో ఉండేది.
హారర్ మూవీ అంటే రోమాంచితమైన సన్నివేశాలు మనుషులను ఉలిక్కిపడేలా చేసే సీన్స్ తో నిండి ఉండాలి. అభ్యంతం సినిమా ఆసక్తిగా సాగినప్పటికీ మరి మనసును పిండేసే సన్నివేశాలు ఏవి ఇందులో లేవు.
సాంకేతిక విభాగం : మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా మ్యాచ్ అయిందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా వ్యవహరించిన అజనీష్ లోక్‌నాథ్ మంచి సంగీతాన్ని అందించారు. అలాగే మూవీకి సంబంధించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. కీలకమైన యాక్షన్ మరియు హారన్ సన్నివేశాలలో ఎఫెక్ట్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సెట్ అయింది.
తీర్పు : సాయి ధరమ్ తేజ నుంచి వచ్చిన ఈ సరికొత్త మిస్టరీ మరియు యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇందులో ఆకట్టుకునే సన్నివేశాలతో పాటు ఉత్కంఠత మరియు నెక్స్ట్ ఏమి జరుగుతుంది అన్న ఆసక్తి ఉంది. మీరు మంచి హారర్ మరియు థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారైతే ఈ చిత్రం కచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి మంచి ఫ్యామిలీ మూవీ విరూపాక్ష అని చెప్పుకోవచ్చు.