Homeసినిమా వార్తలుమంచు హీరో కోసం బరిలోకి బన్నీ

మంచు హీరో కోసం బరిలోకి బన్నీ

Vishnu Manchu Allu Arjun: మంచు విష్ణు హీరోగా న‌టిస్తోన్న ‘మోస‌గాళ్ళు’ సినిమా ప్రమోష‌న్స్‌కు స‌పోర్ట్ ఇవ్వడానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకు వ‌చ్చారు. కొంత కాలంగా బిజినెస్‌ మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన మంచు విష్ణు ‌ త్వరలో ఓ క్రాస్‌ ఓవర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఒకే సారి తెరకెక్కుతున్న ఓ సైన్స్‌ ఫిక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో..ఈ సినిమాకు మోసగాళ్లు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.

అయితే, ఈ సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మంచు విష్ణు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీని కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సహాయం తీసుకుంటున్నారు విష్ణు. ఇంత‌కుముందు టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌ను విక్టరీ వెంక‌టేష్ రిలీజ్ చేయ‌గా.. దానికి అనూహ్యమైన స్పందన వ‌చ్చింది. ఇప్పుడు ‘మోస‌గాళ్ళు’ చేసిన స్కామ్ ఏ స్థాయిలో ఉందో బ‌య‌ట‌పెట్టేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. అక్టోబ‌ర్ 3న‌ ఈ విష‌యాన్ని ఆయ‌న వెల్లడించ‌నున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

mosagallu scam to be exposed by stylish star allu arjun on october 3rd

24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో అందాల చందమామ కాజల్ నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ వెటరన్ హీరో సునీల్ శెట్టి అదిరిపోయే పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. మరి ఈ సినిమాకు బన్నీ ప్రచారం ఎంతవరకు సాయం చేస్తుందో చూడాలి.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY