Gangs Of Godavari New Release Date, Vishwak Sen and Neha Shetty New movie Gangs Of Godavari, Gangs Of Godavari postponed to new release date, Gangs Of Godavari Trailer Release date
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన విశ్వక్‌సేన్ చేస్తున్న సినిమాల్లో ఒకటైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. చల్ మోహన్ రంగా సినిమా ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి లీడ్ హీరోయిన్ గా చేస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 9న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తుంది.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ డేట్ (Gangs Of Godavari New Release Date) విషయంలో హీరో విశ్వక్‌సేన్ చేసిన ట్విట్టర్ పోస్ట్ వైర్ అయిన విషయం తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే తొక్కేస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచనాలను లేపాయి. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ మారిస్తే నేను ప్రమోషన్ లో ఉండను అంటూ ప్రొడ్యూసర్లకి అల్టిమేట్ కూడా జారీ చేయడం జరిగింది. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ నాగ వంశీ రిలీజ్ డేట్ విషయంలో ఒక క్లారిటీ కి వచ్చినట్టు తెలుస్తుంది.
మొదటిగా అనుకున్న విడుదల తేదీకి మూడు సినిమాలు రిలీజ్ కావడంతో , థియేటర్లు దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది.. దానికిగాను ప్రొడ్యూసర్ నాగ వంశీ డిసెంబర్ రెండో వారం చూసినప్పటికీ ఆ తర్వాతి వారంలో ప్రభాస్ సలార్ విడుదలకు సిద్ధంగా ఉంది.. దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని డిసెంబర్ 29న విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ డేట్ అయితే ఇటు క్రిస్టమస్ అలాగే న్యూ ఇయర్ దానితోపాటు సంక్రాంతి కూడా కవర్ చేసినట్టు ఉంటుందని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందంట.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటన త్వరలోనే చేయనున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ విషయంలో హీరో విశ్వక్సేన్ బెట్టు చేస్తున్నప్పటికీ నాగవంశీ అతడికి సర్దిచెప్పి, ప్రమోషన్లకు ఒప్పించి కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించబోతున్నారు. మరి దీనికి హీరో విశ్వక్‌సేన్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.