‘హిట్’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

2177
Vishwak Sen HIT Movie Box office collections report
Vishwak Sen HIT Movie Box office collections report

‘ఫలక్‌నుమా దాస్‌’ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో నిన్న విడుదలైన ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతోంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. హిట్‌ను కొత్త దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్, ఎంగేజింగ్ థ్రిల్లర్ అంటూ ప్రేక్షకులు ప్రశంసించారు.

‘హిట్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తొలి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం 1.32 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందో తెలియాల్సి ఉంది. దీనికి తోడు సినిమాకు పాజిటివ్ టాక్ ఉండటంతో శనివారం, ఆదివారం వసూళ్లు మెరుగయ్యే అవకాశం ఉంది. హీరో నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతగా నానికి ఇది రెండో చిత్రం. ఏమైనా మొదటి రోజు ఈ చిత్రం బాగానే కలెక్ట్ చేసిందని చెప్పాలి. మరి వీకెండ్ పూర్తయ్యేసరికి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

నైజాం 0.67 cr
సీడెడ్ 0.13 cr
ఉత్తరాంధ్ర 0.12 cr
ఈస్ట్ 0.07 cr
వెస్ట్ 0.06 cr
కృష్ణా 0.08 cr
గుంటూరు 0.15 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ 1.32 cr (share)