Vishwak Sen New Movie Dhamki Trailer: విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు తన దర్శకత్వంలో వస్తున్న దాస్ కా ధమ్కీ కా ధమ్కీ ట్రైలర్ ని బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. నివేధా పేతురాజ్ హీరోయిన్‌గా చేస్తున్న ధమ్కీ సినిమాని ఫిబ్రవరి 2023లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
Vishwak Sen New Movie Dhamki Trailer: దాస్ కా ధమ్కీ సినిమా ట్రైలర్ ని నందమూరి బాలకృష్ణ చేతులమీదుగా గురువారం సాయంత్రం విడుదల చేయడం జరిగింది. నివేదా పేతురాజ్, విశ్వక్ సేన్ జంటగా నటిస్తున్న ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
దాస్ కా ధమ్కీ ట్రైలర్ లో విశ్వక్ సేన్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. ట్రైలర్ ని గమనిస్తే రెండు రకాల విభిన్న గెటప్పుల్లో విశ్వక్ సేన్ కనిపిస్తున్నాడు. అలాగే దాస్ కా ధమ్కీ ట్రైలర్ లో కామెడీ, ఎమోషన్ తో పాటు యాక్షన్ కూడా సినిమాలో పరిపూర్ణంగా ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ చిత్రంలో రోహిణి, రావు రమేశ్, పృథ్వీరాజ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వం లో వచ్చిన దాస్ కా ధమ్కీ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తున్నట్టు ధమ్కీ ట్రైలర్ చూపించారు.
వన్యమే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ధమ్కీ సినిమాని ఫిబ్రవరి లో విడుదల చేస్తామన్నారు మేకర్స్ డేట్ అయితే ప్రకటించలేదు.