విశ్వక్ సేన్ ‘పాగల్‌’ ఫస్ట్ లుక్ రిలీజ్

0
325
vishwak-sen-new-movie-paagal-release-date
vishwak-sen-new-movie-paagal-release-date

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం పాగల్. విశ్వక్ సేన్ తన మొదటి సినిమా నుంచి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విశ్వక్ నోటెడ్ అయ్యాడు. ఎప్పటికప్పుడు కొత్త కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా అతడు చేస్తున్న పాగల్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

 

 

ఈ సినిమాతో మాస్ కా దాస్ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ సినిమాను విశ్వక్ హీరోగా నరేష్ కుప్పిల్లి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓ రొమాంటిక్ కథగా తెరకెక్కుతుంది. ఇందులో విశ్వక్ సేన్ తనలోని రొమాంటిక్ యాంగిల్ చూపించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి మాస్ కా దాస్ వారి అంచనాలను ఏమాత్రం అందుకుంటారో వేచి చూడాలి.