Homeసినిమా వార్తలుGangs of Godavari: కొత్త రిలీజ్ డేట్.. మూడు నెలలు వాయిదా ఎందుకు.?

Gangs of Godavari: కొత్త రిలీజ్ డేట్.. మూడు నెలలు వాయిదా ఎందుకు.?

Gangs of Godavari to release on 8th March, 2024, Vishwak Sen next Gangs of Godavari new release date confirmed, Vishwak Sen upcoming movie news, Gangs of Godavari release date

Gangs of Godavari New Release Date: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వినోదాత్మక మరియు వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని మరియు భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన తన తదుపరి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) కోసం రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు.

Gangs of Godavari New Release Date: మొదటిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) సినిమాని డిసెంబర్ 8న విడుదల చేయాలి అని ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయటం జరిగింది. ఐతే అనుకోని కారణాల వాళ్ళ ఇపుడు మార్చి 8న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించటం జరిగింది.

Vishwak Sen next Gangs of Godavari new release date confirmed

ఐతే దీనికి కరం లేకపోలేదు, సినిమా షూటింగ్‌ ఇంకా పూర్తవ్వలేదని, ఎడిటింగ్‌ అలాగే దుబ్బింగ్ దానితో పాటు టేబుల్‌ పై చాలా వర్క్‌ ఉండటం వాళ్ళ 3 నెలలు తరువాత రిలీజ్ కి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, అలాగే ‘సుట్టంలా సూసి’ అనే మెలోడీ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ప్రముఖ నటి నేహా శెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. సుప్రసిద్ధ, ప్రతిభావంతులైన నటి అంజలి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి యొక్క కథను వివరిస్తుంది. అతని కఠినమైన ప్రయాణం రాజకీయ చిక్కులను కూడా కలిగి ఉంటుంది. మేకర్స్ వాటి గురించి ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో సూచన చేశారు.

యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సుట్టంలా సూసి’ పాట ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, ఇన్నమూరి గోపీచంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY