ఫిబ్రవరి 18న విశ్వ‌క్ సేన్ ‘పాగ‌ల్’ టీజర్

0
383
vishwak-sen-paagal-teaser-on-february-18
vishwak-sen-paagal-teaser-on-february-18

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ ‘వెళ్లిపోమాకే’ సినిమాతో పరిచయమైన హైద‌రాబాదీ కుర్రాడు ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ చిత్రంతో ఫేమస్ అయ్యాడు. వివేక్ పాత్ర‌లో విశ్వ‌క్ సేన్ న‌టించిన తీరు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఆ త‌ర్వాత ‘ఫలక్‌నుమా దాస్’ ‘హిట్’ సినిమాలతో త‌న ఫాలోవ‌ర్ల‌ను అమాంతం పెంచేసుకున్నాడు.

 

 

ప్ర‌స్తుతం పాగ‌ల్ సినిమాతో ఆడియెన్స్ కు వినోదాన్ని పంచేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్బంగా ‘పాగల్’ టీజర్ విడుదల తేదీ తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేశారు. ఫిబ్రవరి 18న పాగల్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. న‌రేశ్ కుప్పిలి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30 న పాగల్ థియేటర్లోకి రానుంది.

Previous articleధనుష్ ‘కర్ణన్‌’ పోస్టర్
Next articleAkshara Gowda Latest Photos