Homeసినిమా వార్తలువెయ్యి షోలు వేయడమంటే మామూలు విషయం కాదు: హీరో విశ్వక్ సేన్

వెయ్యి షోలు వేయడమంటే మామూలు విషయం కాదు: హీరో విశ్వక్ సేన్

Vishwak Sen talk about Jr NTR Simhadri Re Release, Jr NTR Simhadri , Jr NTR, Vishwak Sen new movie, Simhadri 4k Re Release, Simhadri re release collection, Simhadri 4k collection report

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా మే 20న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి కోసం వెయ్యి షోలను ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాను రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్ అభిమాని అయిన యంగ్ హీరో విశ్వక్‌ సేన్, హను రాఘవపూడి, గోపీచంద్ మలినేని, మైత్రి నిర్మాత నవీన్‌లు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్‌లో..

విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘‘కొన్ని చోట్ల చీఫ్ గెస్ట్ అని తప్పుగా వేశారు.. కొన్ని చోట్ల డై హార్డ్ ఫ్యాన్స్ అని కరెక్ట్‌గా వేశారు. ఓ హీరో బర్త్ డే సందర్భంగా పాత సినిమాకు వెయ్యి షోలు వేయడం మామూలు విషయం కాదు. ఇది నేషనల్ న్యూస్. ఎన్టీఆర్‌కు అభిమాని అవ్వడం గర్వంగా ఉంది. మూడు రోజుల పెళ్లి ఉంటుంది.. ఇప్పుడు మూడు రోజుల బర్త్ డే. నా మాస్ అమ్మా మొగుడు గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. అమెరికాలో ఎన్ని ఈవెంట్లు ఉన్నా కూడా నా మూవీ ఈవెంట్ కోసం వచ్చారు. నేను ఎప్పటికీ మరిచిపోలేను. నచ్చిన హీరోతో ఫోటో దిగితే చాలని అనుకుంటాం. అలాంటిది మన హీరో మన కోసం వచ్చి మనల్ని బ్లెస్ చేస్తే ఇంకెలా ఉంటుంది. ఎక్కువ వైల్డ్ అయి.. స్క్రీన్స్, సీట్లు చించకండి. మనం మన హీరోలను దేవుళ్లుగా భావిస్తుంటాం.. థియేటర్లను దేవాయాలుగా చూసుకుందాం. అభిమానులంతా కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మే 20న ప్రపంచ వ్యాప్తంగా సింహాద్రి రీ రిలీజ్ అవుతోంది’’ అని అన్నారు.

హను రాఘవపూడి మాట్లాడుతూ ‘‘రాజమౌళి గారు ఈ సినిమాను చేస్తున్నప్పుడు.. నేను చంద్రశేఖర్ యేలెటి వద్ద పని చేస్తున్నాను. నేను ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద అభిమానిని. ఈ సినిమాను మా ఊళ్లో ఫ్రెండ్స్ అందరితో కలిసి చూశాను. నాకు ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్లాక్ చాలా ఇష్టం. ఈ సినిమాను మళ్లీ మే 19న చూస్తాను’’ అని అన్నారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘‘సినిమా రీ రిలీజ్‌కు ఇలాంటి పెద్ద ఫంక్షన్ జరగడం ఇది మొదటి సారి. సింహాద్రితో ఫ్యాన్స్ కొత్త ఒరవడిని సృష్టించారు. సింహాద్రి ట్రైలర్‌ను ఇప్పుడు ప్లే చేసినా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమాను నేను హైద్రాబాద్, ఒంగోలు, విజయవాడలో మూడు సెంటర్లలో చూశాను. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. ఈ సినిమాలో నాకు కొన్ని సీన్స్ చాలా ఇష్టం. నాజర్ గారు స్నానం చేసి వచ్చే లోపు అల్లరి రవిని కొట్టి వస్తాడు. ఆ సీన్ మామూలుగా ఉండదు. అలాంటి ఎపిసోడ్స్ చాలా ఉంటాయి. మాస్‌లో డైలాగ్ చెప్పాలన్నా, హీరోయిజాన్ని పీక్స్‌కు తీసుకు వెళ్లాలన్నా ఎన్టీఆర్ వల్లే  సాధ్యం. అభిమానులందరితో కలిసి ఈ సినిమాను మళ్లీ చూడాలని అనుకుంటున్నాను’’ అని అన్నారు.

Vishwak Sen talk about Jr NTR Simhadri Re Release

మైత్రీ నిర్మాత నవీన్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు చూశాం. కానీ ఇది రీ రిలీజ్ ఈవెంట్. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ట్రైలర్‌ను ఇప్పుడు చూశాక.. మళ్లీ సినిమాను చూడాలనిపిస్తుంది. ఈ సినిమాను నేను అమెరికాలో చూశాను. జనాల గోలకు అక్కడ పోలీసులు వచ్చి షోను ఆపేశారు. సింహాద్రి అనేది ఓ చరిత్ర. అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. అటువంటి ఎన్టీఆర్ గారితో మేం మళ్లీ ఓ సినిమాను చేస్తుండటం ఆనందంగా ఉంది’’అని అన్నారు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY