Vishwak Sen Sensational Tweet On Gangs Of Godavari Movie Release Date Issue, Vishwak Sen twitter post viral, Vishwak Sen upcoming movie, Gangs Of Godavari Release Date
హీరో విశ్వక్ సేన్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్ సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ అఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమాని మన ముందుకు తీసుకురావడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాని అక్టోబర్ 8న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం జరిగింది. కృష్ణచైతన్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అంజలి అలాగే నేహశెట్టి(Neha Shetty) హీరోయిన్స్ గా చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ Glimpse అలాగే మొదటి సాంగు సినిమాపై భారీగానే అంచనాన్ని ఏర్పడేటట్టు చేసింది..

అయితే ఈ రోజు విశ్వక్ సేన్ ట్విట్టర్ వేదికగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా విడుదల తేదీపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. విశ్వక్ తన ట్వీట్ లో.. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెప్తున్నా. డిసెంబర్ 8 వస్తున్నాం. హిట్, ప్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ అది మీ డెసిషన్. ఆవేశానికో, ఈగోకు తీసుకున్న డెసిషన్ కాదు. తగ్గేకొద్దీ మింగుతారని అర్థమైంది. డిసెంబర్ 8 శివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లికి నా ఒట్టు. మహాకాళి నాతో ఉంది. డిసెంబర్ లో సినిమా రిలీజవ్వకపోతే నన్ను ప్రమోషన్స్ లో చూడరు అని ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

అయితే అక్టోబర్ నెలలో ప్రభాస్ అలాగే ప్రశాంత్ నీల్ సినిమా సలార్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించేటప్పటికి టాలీవుడ్ నుండి విడుదలవుతున్న కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ మార్చుకోవటం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున హాయ్ నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆపరేషన్ వ్యాలెంటైన్ సినిమాను కూడా విడుదల అవుతున్నాయి. మరి ప్రొడ్యూసర్ వీటితో పోటీ ఎందుకు అనుకొని సేఫ్ సైడ్ కి రిలీజ్ డేట్ మారుద్దాం అనుకున్నట్టు దానికి హీరో విశ్వక్ సేన్ ఒప్పుకోలేదని.. అందుకే ట్విట్టర్ వేదికగా నోట్ విడుదల చేసినట్టు తెలుస్తుంది.
విడుదల చేసిన కొద్ది నిమిషాలకే మళ్లీ ఆ ట్వీట్ ని హీరో విశ్వక్ డిలీట్ చేయడం జరిగింది. ఈ లోపలే పోస్ట్ వైరల్ కావడంతో చాలామంది అభిమానులు అలాగే మూవీ లవర్స్ సినిమా పోతే నిర్మాతే కదా బాధపడేది అంటూ మరికొందరు నీకు మూవీ మీద అంత నమ్మకం ఉంటే ముందే రిలీజ్ చెయ్ అంటూ వివిధ రకాలుగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమా డిసెంబర్ 8న రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.