Vishwak Sen , Telugu News
Vishwak Sen , Telugu News

ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ రీసెంట్ గా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “హుషారు”తో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో క్రేజీ లవ్ స్టోరీ నిర్మించబోతున్నారు. ఇక ఇటివలే “ఫలక్ నమా దాస్”తో క్రేజీ సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్ తో కలిసి “పాగల్” అనే కొత్త చిత్రం నిర్మించనున్నారు. ఈ మూవీతో నరేష్ రెడ్డి కుప్పిలి అనే యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. క్రేజీ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ నుండి మొదలుకానుంది.

ఇక “ఫలక్ నమా దాస్” లాంటి సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్ తో లక్కీ మీడియా బ్యానర్ నెక్ట్ ప్రాజెక్ట్ చేయడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో నరేష్ రెడ్డి కుప్పిలి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో స్క్రిప్ట్ ను రాసుకున్నాడట. ఇక ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.