మే 1న విశ్వక్ సేన్ ‘పాగల్’

423
vishwak-sens-paagal-confirms-its-releasing-on-may1st
vishwak-sens-paagal-confirms-its-releasing-on-may1st

‘వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది? ఫలక్ నుమా దాస్, హిట్’ చిత్రాల తర్వాత విశ్వక్ సేన్ నటిస్తున్న ఐదవ చిత్రం ‘పాగల్‌’. దిల్ రాజు సమర్పణలో బెక్కెం వేణు నిర్మిస్తున్న ఈ మూవీతో నరేశ్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నిజానికి గత యేడాది మార్చిలోనే  ‘పాగల్‌’ ముహూర్తాన్ని జరుపుకున్నా, కరోనా కారణంగా సెప్టెంబర్ లో కానీ మూవీ సెట్స్ పైకి వెళ్ళలేదు.

 

 

ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి కీలక పాత్రలు పోషించారు. ఇందులో ‘తీర’గా నటిస్తున్న నివేదా పేతురాజు పోస్టర్ ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. అయితే ముందు అనుకున్నట్టుగా ఏప్రిల్ 30న కాకుండా ఒక రోజు ఆలస్యంగా ‘పాగల్‌’ మే 1న జనం ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని పోస్టర్ లో పేర్కొన్నారు.

 

 

ఏప్రిల్ 30న నాగశౌర్య ‘లక్ష్య’ చిత్రం, రానా నటించిన ‘విరాటపర్వం’ విడుదల కాబోతున్నాయి. విశేషం ఏమంటే… ‘విరాట పర్వం’ మూవీలోనూ నివేదా పేతురాజు ఓ కీలక పాత్ర పోషించింది. సో… ఆమె నటించిన రెండు తెలుగు సినిమా బ్యాక్ టు బ్యాక్ డేస్ లో రిలీజ్ కాబోతున్నాయి.

 

 

అలానే సంక్రాంతి కానుకగా వచ్చిన ‘రెడ్’లోనూ పోలీస్‌ ఆఫీసర్ గా రఫ్ అండ్ టఫ్ పాత్రలో నటించి, అలరించింది నివేదా పేతురాజ్. ఇక ప్రస్తుతం థియేటర్లలో జాతర చేస్తున్న ‘జాతిరత్నాలు’కు సంగీతం అందించిన రథన్… ‘పాగల్’ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.