రివ్యూ: ‘వివాహ భోజనంబు’ రుచిగా ఉంది

0
239
Vivaha Bhojanambu Telugu movie Review Rating

విడుదల తేదీ : ఆగస్టు 27, 2021
రేటింగ్ : 2.5/5
నటీనటులు: సత్య, ఆర్జవీ రాజ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, TNR, శివన్నారాయణ మరియు సందీప్ కిషన్
దర్శకుడు: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: కెఎస్ సినిష్ మరియు సందీప్ కిషన్
సంగీత దర్శకుడు: అనివీ
సినిమాటోగ్రఫీ: మణి కందన్
ఎడిటర్: చోటా కె ప్రసాద్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నంత మంది హాస్యనటులు మరో ఇండస్ట్రీలో లేరనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. ఇప్పటికీ హాస్యనటులకు కొదవలేదు. ఇక హాస్య ప్రధానమైన చిత్రాలకు బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ రేటు ఎక్కువే. అలాంటి కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచే నటుల్లో సత్య ఒకరు. ఆయన కీలక పాత్రలో రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వివాహ భోజనంబు’. కరోనా కారణంగా సోనీ లివ్‌ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? లాక్‌డౌన్‌ కష్టాలతో సాగే ఈ కథలో సత్య అండ్‌ కో ఎలా మెప్పించారు?

కథ :
మహేష్(సత్య) హైదరాబాద్ లో ఒక చిన్నపాటి ఉదయిగం చేస్తూ తన లైఫ్ ని అలా సాగిస్తూ ఉంటాడు. అలాగే డబ్బువు విషయంలో చాలా చాలా పొదుపుగా ఉండే మహేష్ అనిత(ఆర్జవీ రాజ్) తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అవుతాడు. అయితే నిశ్చితార్ధనికే అయ్యే ఖర్చులకి భయపడే మహేష్ అలాంటిది పెళ్లి పనులకని వచ్చిన పెళ్లి కూతురి కుటుంబం ఊహించని రీతిలో కరోనా ఫస్ట్ లాక్ డౌన్ లో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? దాన్ని పొడిగించడం వల్ల మహేష్ పడే ఇబ్బందులు ఏమిటి? డబ్బులు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే మహేష్ వాళ్ళందరిని ఎలా డీల్ చేస్తాడు అన్నది తెలియాలి అంటే సోనీ లివ్ లో ఈ చిత్రాన్ని వీక్షించాల్సిందే.

Vivaha Bhojanambu Review Rating in Telugu

బలాలు

సత్య, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, నటన
కథ, హాస్య సన్నివేశాలు
ప్రథమార్ధం

బలహీనతలు

సందీప్‌ కిషన్‌ ఎపిసోడ్‌

నటీనటులు:
పిసినారి మహేశ్‌ పాత్రలో సత్య నటన చాలా బాగుంది. అతని స్నేహితుడిగా నటించిన సుదర్శన్‌, మామగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌లు సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా శ్రీకాంత్‌ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. శివన్నారాయణ, హర్ష, సుబ్బరాయశర్మ ఇలా ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు నటించారు. ప్రధాన ఆకర్షణ అనుకున్న సందీప్‌ కిషన్‌ పాత్ర సోసోగా ఉంది.

Vivaha Bhojanambu Review Rating in Telugu

ఈ చిత్రంలో టెక్నీకల్ టీం సపోర్ట్ పర్లేదని చెప్పాలి. సంగీతం అలాగే సినిమాటోగ్రఫీ డీసెంట్ గా అనిపిస్తాయి అలాగే ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. అలాగే మేకర్స్ నిర్మాణ విలువలు సినిమాతగ్గట్టుగా ఓకే అని చెప్పొచ్చు. చిన్న బడ్జెట్‌ మూవీ. ఒకట్రెండు ప్రదేశాల్లోనే సినిమా మొత్తం సాగుతుంది. భాను భోగవరపు రాసుకున్న కథ చాలా బాగుంది. అయితే, ఇంకొన్ని మెరుపులు జోడించి ఉంటే బాగుండేది. భాను కథను రామ్‌ అబ్బరాజు చక్కగా తీశారు. ప్రతి సన్నివేశాన్ని నవ్వులు పంచేలా తీర్చిదిద్దారు.

Vivaha Bhojanambu Review Rating in Telugu

విశ్లేషణ:
లాక్‌డౌన్‌ కారణంగా ఎంతో మంది ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుపోయి సొంతూళ్లకు వెళ్లలేక అవస్థలు పడిన వారు కొందరైతే.. చుట్టం చూపుగానో, శుభకార్యానికో వచ్చి బంధువుల ఇంట్లో ఇరుక్కుపోయిన వారు ఇంకొందరు. ఇలా బంధువుల ఇంట్లో అదీ ఒక పిసినారి ఇంట్లో పది, పదిహేను మంది ఉంటే, వారి పోషించడానికి అతడు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఇలా గతేడాది కొన్ని కుటుంబాల్లో ఎదురైన ఇలాంటి వాస్తవ పరిస్థితులను కథగా రాసుకున్నాడు భాను భోగవరపు. దానికి తనదైన టైమింగ్‌తో నవ్వులు పంచేలా ‘వివాహ భోజనంబు’ను తెరకెక్కించడంలో రామ్‌ అబ్బరాజు విజయం సాధించారు.

ఇదివరకు తన కామికల్ టైమింగ్ తో మంచి ఫన్ రోల్స్ ని రక్తి కట్టించిన సత్య ఇందులో కూడా సెటిల్డ్ నటనను కనబరిచాడు. పొదుపుగా డబ్బు వాడే లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తిగా తాను చూపిన హావభావాలు కామెడీ, ఎమోషన్స్ అన్నీ కూడా బాగుంటాయి. అలాగే హీరోయిన్ గా కనిపించిన ఆర్జవీ కూడా మంచి నటనను కనబరిచింది. పలు సన్నివేశాల్లో మంచి క్యూట్ నటన తన పాత్ర పరిధి మేరకు డీసెంట్ యాక్టింగ్ కనబరిచింది.

అనవసర సన్నివేశాలకు జోలికి పోకుండా మహేశ్‌-అనితల ప్రేమ వ్యవహారాన్ని, పెళ్లిని అమ్మాయి ఇంట్లో చెప్పడం ద్వారా నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఆ తర్వాత మహేశ్‌ నిశ్చితార్థం, పెళ్లి ఇలా ఒక్కో సన్నివేశాన్ని నవ్వించేలా తీర్చిదిద్దారు. లాక్‌డౌన్‌ కారణంగా అందరూ మహేశ్‌ ఇంట్లో ఉండిపోవడం, అక్కడ మహేశ్‌ పడే ఇబ్బందుల ద్వారా ప్రేక్షకుడికి వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

సత్య రోల్ ని ఒకలా సినిమాలో చూపిస్తారు కానీ దానిని హీరోయిన్ కుటుంబీకులతో మాత్రం లాజిక్ లేకుండా ప్రెజెంట్ చెయ్యడం వింతగా అనిపిస్తుంది. వీటితో పాటుగా స్క్రీన్ ప్లే కూడా పెద్ద కొత్తగా ఏమి కనిపించదు.  ముఖ్యంగా సందీప్‌ కిషన్‌ను తాగుబోతుగా, ‘భ్రమ’లో బతికే వాడిగా చూపించిన విధానం ద్వారా హాస్యం పుట్టించాలనుకున్నాడు దర్శకుడు. అది నవ్వులు పంచకపోగా ఆయా సన్నివేశాలన్నీ అతికించినట్లు అనిపిస్తాయి. ఓవరాల్‌గా ఓ మంచి కామెడీ మూవీ చూసిన ఫీల్‌ ప్రేక్షకుడికి కలుగుతుంది.