Vivek Agnihotri Comments on Prabhas: ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచారు. ప్రభాస్ పై ఇతను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కాకుండా వార్తల్లో వైరల్ గా మారాయి. ప్రభాస్ పై వివేక అగ్ని ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది… కావాలని చేశారా లేదంటే ప్రభాస్ అలాగే ఆదిపురుష్ సినిమాల్లో నటించారా అనేది తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ మన ఇండియా సినిమాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేసిన ప్రభాస్ గురించి డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలమైన కామెంట్స్ చేయటంతో ప్రభాస్ ఫ్యాన్స్ క్షమాపణ చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
Vivek Agnihotri Comments on Prabhas: ఇక విషయంలోకి వెళ్తే, ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.. దానిలో ఒకటి రీసెంట్ గా ఆదిపురుష్ అనే సినిమా విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. ఆదిపురుష్ సినిమాని ప్రొడ్యూసర్లు దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం జరిగింది కానీ నుండే ఈ సినిమా విఎఫ్ఎక్స్ పైన నెగటివ్ టాక్ రావడంతో సినిమా మొదటివారంలో కలెక్షన్స్ ని రాబట్టిన ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద శశికళ పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆదిపురుష్ సినిమా ఓటీడీలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.
ఆదిపురుష్ సినిమా విడుదల తర్వాత కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమా ఫ్లాప్ అవటానికి ప్రభాసే కారణమంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేయడం జరిగింది.. అక్కడితో ఊరుకోకుండా వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్‌ను నటుడే కాదని..ఆదిపురుష్ సినిమా కూడా ఒక నాన్సెన్స్ అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. అయితే ఈ గొడవ సద్ధుమణగక ముందే ఇప్పుడు మళ్లీ దర్శకుడు ఇన్ డైరెక్ట్ గా ప్రభాస్ ని టార్గెట్ చేయడం జరిగింది.
రీసెంట్ గా జరిగిన ఒక మీడియా సమావేశంలో, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. మన పురాణాలకు సంబంధించిన కథల విషయంలో దర్శకులు చాలా తప్పు చేస్తు్న్నారు… మహాభారతం లేదా రామాయణం వంటి సినిమాల కోసం పెద్ద స్టార్ హీరోలు అలాగే ఎక్కువ బడ్జెట్ పెట్టుకుంటే ఫలితం ఉండదు. ఇలాంటి కథలు తీసే టైంలో దర్శకులు కానీ ప్రొడ్యూసర్లు కానీ కథపై ముందుగానే వంద శాతం విశ్వాసం ఉంచాలి. దేవుడికి సంబంధించిన కథలను నటించడం వల్ల స్టార్ హీరోలు దేవుళ్ళు అయిపోరు.. ప్రతి రోజూ రాత్రి పీకలదాకా తాగి తెల్లవారి నేనే దేవుణ్ని అంటే ఎవరూ నమ్మరు. ప్రజలు మూర్ఖులు కాదు’ అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు.

కాక ఈ మాటలు ఇప్పుడు ప్రభాస్ ని ఉద్దేశించే ఇన్ డైరెక్ట్ గా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కామెంట్ చేశారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. సెప్టెంబర్ లో ప్రశాంత్ నీళ్ళు దర్శకత్వం వహిస్తున్న సలార్ మూవీ అలాగే జనవరి 24 లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 AD. ఇప్పటికే విడుదలైన ఈ రెండు సినిమాల టీజర్లు అలాగే మొదటి లుక్కు సినిమాపై భారీ అంచనాలకు దారితీసాయి.