చిత్ర ఆత్మహత్య.. భర్తను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు

0
429
VJ Chitra death case_ Husband arrested for abetment to suicide

బుల్లితెర నటి వీజే చిత్ర ఆత్మహత్య కేసులో ఆమె భర్త హేమంత్‌ రవిని పోలీసులు అరెస్టు చేశారు. చిత్ర ఈ నెల 9వ తేదీన చెన్నైలోని నజరత్‌పేట్టైలో గత ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. పోస్టు మార్టం రిపోర్టు ఆత్మహత్యగానే చెబుతున్నా ఆమె భర్త హేమంత్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేయక తప్పలేదు. ఆమె ఉరి వేసుకుని మరణించారన్న వార్త బయటకు వచ్చినా భర్త హేమంత్ పైనే అందరి అనుమానాలూ ఉన్నాయి.

ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిత్ర భర్తతో పాటు ఆమె సహనటులు, స్నేహితులను విచారిస్తున్నారు. తమ కూతురిని అల్లుడే కొట్టి చంపేశాడని చిత్ర తల్లి విజయ ఆరోపించడంతో పోలీసులు అతడిపైనే ఫోకస్ పెట్టారు. ఈ కేసుకు సంబంధించిన మరికొన్ని వివరాలను నిజరత్ పేట్ ఏసీపీ సుదర్శన్ వివరించారు. దీని ప్రకారం చిత్ర నటిస్తున్న షోలో ఓ సన్నివేశంపై హేమంత్ కుమార్ అభ్యంతరం పెట్టారు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. ఈ గొడవలో హేమంత్ ఆమెను తోయగా ఆమె పడిపోయింది. ఈ కారణంగానే ఆమె మరణించిందని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఏసీపీ వివరించారు.

ఆమె మరణానికి సంబంధించిన మరికొన్ని వివరాలను పూర్త దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. చిత్ర విషయంలో అతను కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడైంది. ఆమె మరొకరితో సన్నిహితంగా మెలగడం కూడా హేమంత్ కోపానికి కారణమని తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నట్లు చిత్ర తల్లి విజయ చెబుతున్న మాటలు. చిత్ర, హేమంత్ ల మధ్య మరో వ్యక్తి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎవరనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

Previous articleపెళ్లి తర్వాత సినిమా.. నా అదృష్టమే: సమంత
Next article`రెడ్‌`లోని కౌన్ హే అచ్చా.` పాటకు ట్రెమండస్ రెస్పాన్స్