VV Vinayak , Boyapati Srinu, Tollywood Movie News
VV Vinayak , Boyapati Srinu, Tollywood Movie News

వినయ విధేయరామ ఇచ్చిన షాక్ నుండి ఆల్మోస్ట్ అంతా తేరుకున్నారు.కానీ చేజేతులా ఆ సినిమాని ఒక డిజాస్టర్ గా తీర్చిదిద్దిన బోయపాటి ని మాత్రం ఆ సినిమా చేదు జ్ఞాపకాలు వదలట్లేదు.సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్ సైతం వెనక్కి ఇవ్వాలని ఒక పంచాయితీ కూడా జరిగింది.ఇక ఆఫర్స్ సంగతి మాట్లాడుకోకపోతేనే బెటర్.

అయితే తనకి స్టార్డం ఇచ్చిన బాలయ్యతో మళ్ళీ సినిమా చేసి ఫామ్ లోకి రావాలని బాలయ్య పెట్టిన కండిషన్స్ కి ఒప్పుకుని మరీ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ చేసుకున్నాడు.ఎలెక్షన్స్ హడావిడి మొదలవడంతో TDP కి యాడ్ చేస్తూ ఫుల్ బిజీ అయిన బోయపాటి ఎలెక్షన్స్ తరువాత మళ్ళీ బాలయ్యని అప్రోచ్ అయ్యాడు.ఈ లోగా బాలయ్య మూడ్ మారిపోయింది.దాంతో ప్లాన్ కూడా మారిపోయింది.తన బ్యానర్ మీద చెయ్యాలనుకున్న బోయపాటి సినిమాని పక్కనబెట్టి జై సింహా లాంటి హిట్ సినిమా అందించిన KS రవి కుమార్ తో మళ్ళీ సినిమాకి ఓకే చెప్పాడు.ఆల్మోస్ట్ జై సింహ కి పనిచేసిన టీమ్ ఈ సినిమాకి కూడా పనిచేస్తుంది.రూలర్ అనే టైటిల్ కూడా పెట్టారు అని చెప్పుకుంటున్నారు.

రవికుమార్ సినిమా తరువాత తన సినిమానే అని సర్దుకున్న బోయపాటికి ఈ సారి వినాయక్ రూపం లో మరొక స్పీడ్ బ్రేకర్ తగిలింది.ఎప్పటినుండో బాలకృష్ణతో సినిమా కోసం వెయిటింగ్ లో ఉన్న వినాయక్ కథ పరంగా బాలయ్యని కన్వీన్స్ చెయ్యలేకపోయాడు.దీంతో వెటరన్ రైటర్స్ అయిన పరుచూరి బ్రదర్స్ తో బాలయ్య కి సరిపోయే ఒక కథ తయారు చేయిస్తున్నాడు.బాలయ్య కి చాలా హిట్స్ ఇచ్చిన అనుభవం ఉన్న పరుచూరి బ్రదర్స్ మంచి పవర్ ఫుల్ ఎలిమెంట్స్ తో సగం కథ రెడీ చేసారు అని ఫిలిం నగర్ టాక్.ఈ కథ కనుక బాలకృష్ణ కి నచ్చితే బోయపాటి సినిమా ఇంకా వెనక్కి వెళుతుంది.ఆ సినిమాకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి,ఇప్పడు సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యాలి అన్న ఆలోచన మానుకున్న బాలయ్య ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ లోగా వినాయక్ కూడా రవితేజ సినిమా కంప్లీట్ చేసుకుని రావచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు.వినాయక్ కథతో బాలకృష్ణ ని ఒప్పించుకుంటే మాత్రం బోయపాటి మరో హీరోని వెదుక్కోవలసిందే.వచ్చిన పెద్ద అవకాశాన్ని జారవిడుచుకోవడంతో బోయపాటి ఎంత కాస్ట్లీ మిస్టేక్ చేసాడు అనేది రియలైజ్ అయ్యాడో?…లేదో అనే సెటైర్స్ కూడా వినిపిస్తున్నాయి.