ఇట్స్ అఫీషియల్ : చత్రపతి బాలీవుడ్ రీమేక్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

0
297
VV Vinayak Direct to Bellamkonda to act in Hindi remake of Chatrapathi confirmed

అనుకున్నట్లే అయింది ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఛత్రపతి’ సినిమా రీమేక్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తున్నాడు. వి.వి. వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. పెన్ స్టూడియోస్ నిర్మాణంలో సాయి శ్రీనివాస్ తేజ్ హీరోగా ఈ రీమేక్ సినిమా మా తెరకెక్కనున్నట్లు కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు.

2005 సంవత్సరం లో ప్రభాస్ హీరోగా శ్రియ శరణ్ హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆరోజుల్లో సంచలన విజయం సాధించింది. ఒక విధంగా వినాయక్ కు కూడా ఇది మంచి అవకాశంగానే భావించాలి. వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ ను ‘ఆది’గా మార్చి తెలుగులో ఆయనకు ఓ స్టార్ డమ్ ను క్రియేట్ చేశారు. దీనికి హిందీలో కూడా ఛత్రపతి అనే పేరునే పెట్టారు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు హిందీలోకి అనువాదమై మంచి ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ లో ఈ సినిమాలకు మంచి వ్యూస్ లభిస్తున్నాయి.

అల్లుడు శీను సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వినాయక్ తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇప్పుడు కూడా ఆయనే బెల్లంకొండని చత్రపతి సినిమా రీమేక్ తో బాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా ఈ కథకు మార్పులు చేర్పులు చేశారు. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా మా హీరో దర్శకుడు నిర్మాత ల పేర్లు బయటకు వచ్చిన వేరే విషయాలు బయటికి రాలేదు త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది

Previous articleమీకో దండం.. నాకే సంబంధం లేదంటున్న బండ్ల గణేష్..!
Next articleIt’s official: Bellamkonda Sai’s Bollywood debut under VV Vinayak’s direction