Peddha Kapu 1 Trailer: పెద్ద కాపు-1 అనే పొలిటికల్ డ్రామాతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మన ముందుకు రాబోతున్నారు. విరాట్ కర్ణను హీరోగా పరిచయం చేస్తున్నారు ఈ సినిమాలో. ముందే విడుదల చేసిన టీజర్‌తో సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్ తెచ్చిన మేకర్స్, ఈ రోజు డైరెక్టర్ వివి వినాయక్ పెద్ద కాపు-1 థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయటం జరిగింది.
Peddha Kapu 1 Trailer: ఈ సినిమా ని సెప్టెంబర్ 29న విడుదలకి సిద్ధం చేయటం జరిగింది. ట్రైలర్ చుస్తే చాల యాక్షన్ సీన్స్ తో విడుదల చేయటం జరిగింది. తెలుస్తోంది. ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు, వెనుకబడిన మహిళలు ఎదుర్కొంటున్న భయాందోళనలను క్లుప్తంగా ప్రస్తావించారు. న్యాయం, అన్యాయం, సామాన్య ప్రజలపై అధికార పోరు, రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు. వీటికి ఎదురు తిరిగిన యువకుడు ఎలా పోరాడాడు వీళ్ళతో అనేది కనపడుతుంది.
శ్రీకాంత్ అడ్డాల ఈ కథను ఆకట్టుకునే రీతిలో వివరించాడు. ముఖ్యంగా డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా వున్నాయి. ఛోటా కె నాయుడు కెమెరా వర్క్ మరియు మిక్కీ జె మేయర్ యొక్క బిజిఎమ్ ట్రైలర్ కి హైలైట్ అని చెప్పచు. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్.. ఈ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేయడం విశేషం.
చివరగా ఈ యువకుడు అన్యాయాలను ఎంతవరకు ఎదిరించాడు? అతను ఎలా పోరాడాడు? మరి చివరికి గెలుస్తాడో లేదో చూడాలి. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన మిరియాల రవీందర్ రెడ్డి తన తదుపరి చిత్రంగా ‘పెదకాప్ 1’ నిర్మించనున్నారు. మిరియాల సత్యనారాయణ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి తన మేనల్లుడు విరాట్ కర్ణ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలైన టైటిల్, పోస్టర్, టీజర్ చూసిన సినీ ప్రియులు ఈ సినిమా చాలా ఘాటుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.