Anchor Ravi given clarity on war with another anchor Sreemukhi
Anchor Ravi given clarity on war with another anchor Sreemukhi

‘పటాస్’ షో తో శ్రీముఖి ఎంత పాపులారిటీ సంపాదించుకుందో.. యాంకర్ రవి కూడా అంతే పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఆ షో సూపర్ హిట్ అవ్వడానికి.. వారు ఎంతో కృషి చేశారనే చెప్పాలి. యాంకర్ రవితో శ్రీముఖిని లింకుపెడుతూ జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పుకొనేవారు. అయితే ఈ ఇద్దరి యాంకర్ల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నట్టు.. ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.. రవితో గొడవల కారణంగానే పటాస్ నుంచి శ్రీముఖి బయటికి వచ్చేసిందనే పుకార్లు వచ్చాయి. తరువాత వీరి మధ్య గొడవలు పెరిగినట్టు కూడా టాక్ వినిపించింది. కొన్నాళ్ళ తరువాత రవి కూడా ‘పటాస్’ నుండీ తప్పుకున్నాడు. అయితే తాజాగా ఈ విషయం పై యాంకర్ రవి స్పందించాడు.

రవి మాట్లాడుతూ.. “శ్రీముఖికి నాకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు,. ఆమె నా వల్ల షో నుంచి వెళ్ళిపోలేదు. నాకు అస్సలు సంబంధం లేదు. ఆమె పర్సనల్ రీజన్స్ తోనే తప్పుకుంది. ఆ తరువాత ‘బిగ్ బాస్3’ కి వెళ్ళింది. శ్రీముఖి మంచి కో యాంకర్. ఒక్క పంచ్ వేస్తే.. వెంటనే కౌంటర్ గా పది పంచ్ లు వేస్తుంది. ఇప్పటికీ ఆమె నాకు మంచి ఫ్రెండ్. ఓ మంచి అవకాశం వచ్చినప్పుడు.. ఇప్పుడు చేస్తున్న దాన్ని పక్కన పెట్టడం చాలా కామన్. మంచి ఆఫర్ వస్తే ఎవరైనా అలానే చేస్తారని, ఇక నాకు మంచి అవకాశాలు రావడంతో నేను పటాస్ ని వదిలేసానని చెప్పుకొచ్చాడు. అంటూ చెప్పుకొచ్చాడు.

వెంకీ మామ రివ్యూ
‘వెంకీమామ’ హంగామా.. ఫస్ట్ డే కలెక్షన్స్