WAR Movie, Sye Raa Movie, Chiranjeevi, Hrithik Roshan, Telugu News
WAR Movie, Sye Raa Movie, Chiranjeevi, Hrithik Roshan, Telugu News

టాలెంటెడ్ అండ్ షార్ప్ డైరెక్టర్ సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. ఇక తాజగా విడుదల అయిన ట్రైలర్ అంచనాలకి తగ్గట్లుగానే బాగా ఆకట్టుకుంది. అయితే సైరా సినిమా పై భారీ అంచనాలు ఉండటంతో అక్టోబర్ 2న పూర్తిగా చిరంజీవికే వదిలేశారు తెలుగు స్టార్ హీరోలందరూ.

అయితే బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మాత్రం అక్టోబర్ 2న తమ సినిమా విడుదల చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్’ హిందీతో పాటు తెలుగులో కూడా అక్టోబర్ 2నే రానుంది. కానీ ‘సైరా’ దెబ్బకి ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతుందని మొదట అనుకున్నప్పటికీ.. వార్ సినిమాని అనుకున్న డేట్ కే.. మెగాస్టార్ కి పోటీగా విడుదల చేసేలా ప్లాన్ చేశారు.

మరి వీరు మెగా స్టార్ కి పోటీని ఇవ్వగలరా.. సైరాలో అమితాబ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో సైరా పై బాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు సైరా టీమ్ హిందీలో కూడా భారీ ఎత్తున గొప్ప ప్రచార ప్రణాళికలను రూపొందిస్తున్నారు. పైగా ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు మరియు హిందీ ప్రేక్షకులే కాకుండా.. కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

మరి హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్’, ‘సైరా’కి ఏ రేంజ్ పోటీ ఇస్తోందో చూడాలి. అయితే వార్ పై ఇప్పటికే బాలీవుడ్ లో మంచి బజ్ ఉంది. పైగా హృతిక్ రోషన్ నుండి ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలం అవ్వడం కూడా వార్ కి మంచి అవకాశం. మొత్తానికి ఈ ‘సైరా’కి వార్ గట్టి పోటీనే.