సుల్తాన్ తెలుగు హక్కులు సొంతం చేసుకొన్నా వరంగల్ శ్రీను

179
warangal-srinu-bagas-sultan-telugu-movie-rights
warangal-srinu-bagas-sultan-telugu-movie-rights

ప్రస్తుతం తెలుగు చాలా సినిమాలు సిద్దంగా ఉన్నాయి. వాటిలో సూర్య తమ్ముడు కార్తి తాజా చిత్రం సుల్తాన్ కూడా ఒకటి. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా లక్కీ బ్యూటీ రష్మిక తమిళంలోకి అరంగేట్రం చేయనున్నారు. ఈ సినిమాను బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు.

 

 

ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తెలుగు హక్కులను డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అతడే విడుదల చేయనున్నారు.

 

 

అయితే ఈ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 1న విడుదలైంది. సినిమాపై అంచనాలను ట్రైలర్ మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే కార్తీ మని రత్వం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్‌లోనూ కీలక పాత్ర చేస్తున్నారంట. ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.