బీజేపీ లీడర్ కుమారుడితో కీర్తి సురేష్ పెళ్లి.. నిజమేనా..?

Keerthy Suresh wedding with a businessman

Keerthy Suresh Marriage: కీర్తి సురేష్.. మహానటి సావిత్రి సినిమా ద్వారా తనలో అద్భుతమైన నటి ఉందని నిరూపించుకుంది. అంతటి గొప్ప సినిమాలో నటించిన తర్వాత కూడా కీర్తి సురేష్ కమర్షియల్ సినిమాలకు దూరమవ్వలేదు. ప్రస్తుతం ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తూనే.. నితిన్ సరసన రంగ్ దే సినిమాలో నటిస్తోంది. ఇప్పటి వరకూ కీర్తి సురేష్ మీద ఎటువంటి రూమర్లు లేవు.. కానీ తాజాగా ఆమె పెళ్లి గురించి ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.

కీర్తి సురేష్ త్వరలోనే ఓ బీజేపీ లీడర్ కుమారుడిని పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెళ్లి గురించి ఇరు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఓ మాట అనేసుకున్నారని అంటున్నారు. ఈ రూమర్లు ఇక్కడితో ఆగిపోలేదు లాక్ డౌన్ పూర్తీ అవ్వగానే పెళ్లి పనులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. ఆ బీజేపీ నాయకుడి పేరు ఇంకా బయటకు రాలేదు. ఇది నిజమా.. లేక.. అబద్దమా అన్నది తెలియాల్సి ఉంది.

జాతీయ అవార్డు అందుకున్న తర్వాత కీర్తి సురేష్ కు వరుసగా ఆఫర్లు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆమె పెళ్లి చేసుకోవడం వలన ఆమె కెరీర్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కీర్తి సురేష్ కానీ.. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎవరూ కూడా ఆమె పెళ్లి గురించి ప్రస్తావించలేదు. కానీ ఆమె ఇప్పుడు పెళ్లి కూతురు అవుతోంది అని వస్తున్న వార్తలు నిజమా.. లేక టీవీలో కీర్తీ సురేష్ పెళ్లి కూతురి గెటప్ లో ఓ యాడ్ లో కనిపించడంతో మనవాళ్ళు అలా ఊహించేసుకున్నారా అన్నది కొద్దిరోజుల్లోనే తెలుస్తుంది.