Nikhil Siddharth Up Coming movies, Details
Nikhil Siddharth Up Coming movies, Details

స్వామి రారా సినిమాతో హిట్ అందుకుని అక్కడి నుండి డిఫరెంట్ సినిమాలు చేస్తూ మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నాడు నిఖిల్.అయితే చందూ మొండేటి,సుధీర్ వర్మ లాంటి డైరెక్టర్స్ బ్యాక్ అప్ ఉందని అని కొత్త డైరెక్టర్ తో కిర్రాక్ పార్టీ అనే రీమేక్ చేసాడు.దాంతో ఆ సినిమా రిజల్ట్ ఫుల్లుగా తేడా కొట్టేసింది.దాంతో అతను ప్రస్తుతం చేస్తున్న కనితన్ రీమేక్ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఒరిజినల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సంతోష్ ఈ సినిమాకి కూడా డైరెక్టర్.కానీ నిఖిల్ కూడా ఇన్వాల్వ్ అవుతూ సినిమాని డ్రాగ్ చేసాడు.సరే సినిమా పూర్తయ్యింది అనుకునేలోపు ఆ సినిమా టైటిల్ మార్చాలివచ్చింది.ఆ తరువాత ఫ్రెష్ గా రిలీజ్ డేట్ ఇచ్చి సినిమాని రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు.కానీ ఏం జరిగిందో తెలియదు సినిమా మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని స్టేజ్ లో వాయిదా పడింది.అయితే ఈ లోగా అతను స్టార్ట్ చేసిన శ్వాస అనే సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.అది కూడా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఇదంతా ఓకే అనుకుంటే చందూ మొండేటి డైరెక్షన్ లో చెయ్యాల్సిన కార్తికేయ-2 అసలు మొదలయ్యే పరిస్థితులు కూడా కనిపించట్లేదు అని టాక్.సవ్యసాచి ఫెయిల్ అయినదగ్గరినుండి శర్వానంద్ కోసం ట్రై చేస్తున్న చందూ మొండేటి ఆ సినిమాకి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట.కానీ కార్తికేయ-2 పాయింట్ మాత్రమే చేతిలో ఉండడంతో నిర్మాతలు బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే సెట్స్ మీదకి వెళ్ళేది అని చెప్పారట.దాంతో కార్తికేయ-2 ఎప్పుడు మొదలువుతుందో,అసలు ఆ సినిమా ఉంటుందో,లేదో కూడా తెలియని డైలమా నెలకొంది.ఒక సినిమా షూటింగ్ పూర్తయ్యి ఆగిపోయింది,రెండో సినిమా సగం షూటింగ్ లో ఆగిపోయింది.మూడో సినిమా పూర్తికాకముందే ఆగిపోయింది.నిఖిల్ కే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒక మిస్టరీగా మారింది.మరి నిఖిల్ ఎప్పుడు ఈ కష్టాలనుండి బయటపడి హిట్ అందుకుంటాడో చూడాలి.

[INSERT_ELEMENTOR id=”3574″]