మహేష్ 27 వ సినిమా ఎవరిచేతుల్లో…?

Mahesh, Sarileru Neekevvaru, Gemini TV, Satellite rights
Mahesh, Sarileru Neekevvaru, Gemini TV, Satellite rights

[INSERT_ELEMENTOR id=”3574″]

మహర్షి సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్స్ సృష్టించింది మహర్షి.కానీ ఆ సినిమా నిర్మాతలకి మాత్రం లాభాలు అంతంతమాత్రంగానే వచ్చాయి.దానికి రెండు కారణాలు ఉన్నాయి.ఆ సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడం అనేది ఒక కారణం అయితే,ఆ సినిమాకి ముగ్గురు పార్టనర్స్ ఉండి,లాభాలు పంచుకోవడం అనేది మరొక కారణం.అందుకే నెక్స్ట్ వంశీ పైడిపల్లి-మహేష్ ల కాంబినేషన్ లో వచ్చే సినిమాకి దిల్ రాజు సోలో ప్రొడ్యూసర్ గా ఉండాలి అనుకున్నాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

అయితే ఆ సినిమాకి మహేష్ నాన్-థియేట్రికల్ రైట్స్ ని రెమ్యునరేషన్ గా తీసుకోవడంతో దిల్ రాజు అంత హ్యాపీ గా లేడు అనే టాక్ వచ్చింది.ఇక ఇప్పుడు వంశీ పైడిపల్లికి పీవీపీ తో ఉన్న కమిట్మెంట్ వల్ల అతను ఒక పార్టనర్ గా ఉండాలి.అలాగే వంశీ పైడిపల్లి సోనీ పిక్చర్స్ ని కూడా ఆ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా చెయ్యాలి అనేది వంశీ పైడిపల్లి ఆలోచన అని అర్ధమవుతుంది.ఇదే కనుక జరిగితే దిల్ రాజు ఆ సినిమానుండి ఖచ్చితంగా తప్పుకుంటాడు.మహేష్ బాబు సినిమాకి ఈ ముగ్గురు ప్రొడ్యూసర్స్ అనే కాన్సెప్ట్ అచ్చొస్తున్నా వాళ్ళకి మాత్రం పెద్దగా ఉపయోగం ఉండట్లేదు.మరి మహేష్ 27 మొదలయ్యే టైం కి ప్రొడ్యూసర్స్ కార్డు లో ఎవరి పేర్లు ఉంటాయో మరి.

[INSERT_ELEMENTOR id=”3574″]