SS Rajamouli, RRR Movie, Jr NTR ,Ram Charan, Tollywood Movie News
SS Rajamouli, RRR Movie, Jr NTR ,Ram Charan, Tollywood Movie News

RRR ..ఇండియా లెవెల్ లో భారీ మల్టీ స్టారర్.డైరెక్టర్ రాజమౌళి వల్ల సినిమాకి ఇంటర్నేషనల్ ఫోకసింగ్ ఏర్పడింది.అయితే సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్,రామ్ చరణ్ లలో ఎక్కువ ఎవరు హైలైట్ అవుతారు అంటే ఇద్దరినీ బాలన్స్ చేస్తారు అనే సమాధానం వినిపిస్తుంది.కానీ సినిమా ఇన్ సైడర్స్ ఇస్తున్న హింట్స్ మాత్రం షాకింగ్ గా ఉన్నాయి.

సినిమాలో యాక్షన్ కంటెంట్ అంతా ఎన్టీఆర్ పై డిజైన్ చేసాడట రాజమౌళి.కొమురం భీం లో ఉన్న ఆవేశంతో అల్లూరి కూడా విప్లవం వైపు అడుగులేసినట్టు చూపిస్తున్నారు.అయితే అల్లూరి లాంటి వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే కొమురం భీం పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి. సినిమా విషయంలో అదే జరిగింది అంటున్నారు.కథాపరంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ కి ఎడ్జ్ దక్కింది.అలానే సినిమాలో ఎన్టీఆర్ లుక్ చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ తినడం ఖాయం అంటున్నారు.

చరణ్ మేకోవర్ లో పెద్ద మార్పులు ఏమీ ఉండవు,మనకు తెలిసిన అల్లూరి లానే చూపించబోతున్నాడు అంటున్నారు.ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ ఎలివేషన్ ముందు బాహుబలి కూడా చిన్నబోవడం ఖాయం అంటున్నారు.అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ మొత్తం ఎన్టీఆర్ పైనే డిజైన్ చేయడం విశేషం.మొత్తానికి సినిమా స్టార్ట్ అవ్వకముందు RRR లో చరణ్ హైలైట్ అవుతాడు అని వినిపించిన మాటలు ఇప్పుడు రివర్స్ అయ్యాయి.అయినా కూడా చరణ్ కి కూడా గూస్ బంప్స్ మూమెంట్స్ కొన్ని రెడీ చేసి పెట్టాడట.సినిమా షూటింగ్ లోనే ఫ్యాన్స్ పండగ చేసుకునే లీక్స్ వస్తున్నాయి RRR నుండి.మరి సినిమా రేంజ్ సంచలనం రేపుతుందో చూడాలి.