కృతి సనన్ ఎంపిక వెనుక ఎవరి రాజకీయం..!

1798
who is the behind selection of Kriti Sanon for Adipurush Sita Role

ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకింది.ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే సాలార్ తరువాత ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఆది పురుష్. అయితే ప్రభాస్, అజయ్ దేవగన్ లాంటి భారీ తారాగనంతో రామాయణం స్టోరీ ఒక సినిమా రూపంలో రాబోతుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా వచ్చిన ఓ అప్డేట్ ఆసక్తి కలిగిస్తోంది.

‘ఆదిపురుష్’ మూవీలో సీతాదేవి పాత్రకు ఆమెను ఎంపిక చేయడంతో ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ‘1 నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ ఆమూవీ ఫ్లాప్ కావడంతో టాలీవుడ్ నుండి వెనుతిరిగి వెళ్ళిపోయింది. అయితే ఆతరువాత జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు రావడంతో కృతి నెమ్మదిగా బాలీవుడ్ లో ఎదిగిపోయింది.

వాస్తవానికి కృతి సనన్ బాలీవుడ్ లో ఔట్ సైడర్. ఆమె ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఎదిగిన బ్యూటీ. అయితే కెరియర్ కు సంబంధించిన గేమ్ లో తన మొదటి చిత్రం నుండే కృతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ ల మద్దతుతో మంచి స్క్రిప్ట్ లను మాత్రమే ఎంచుకుంటు చాల వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అంతేకాదు ఆమెకు ఉన్న అమితమైన జ్ఞాపక శక్తితో ఒక పేజీ డైలాగ్ ను ఒక్కసారి చూస్తే చాలు వెంటనే చెప్పేస్తుంది అంటారు.

Kriti Sanon as Sita and Sunny Singh as Laxman join the team of Prabhas and Saif Ali Khan starrer Adipurush

దీంతో ప్రభాస్ దృష్టి వరకు రావడంతో ప్రభాస్ ఏరికోరి కృతిని ఎంపికచేసుకున్నాడు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. అలగె అజయ్ దేవగన్ రికమెండ్ చేశారని తెలుస్తోంది. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం సీత గా ప్రభాస్ పక్కన కృతిని ఊహించుకోలేకపోతున్నాము అంటూ సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు..