Sharwanand Ranarangam Adivi Sesh Evaru, box office collections-min
Sharwanand Ranarangam Adivi Sesh Evaru, box office collections-min

శర్వానంద్ నటించిన రణరంగం,అడివిశేష్ బ్రాండింగ్ తో వచ్చిన ఎవరు?.ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి.నిజానికి ఈ రెండిట్లో పెద్ద సినిమా అయిన రణరంగం పైనే ఎక్కువ అంచనాలు ఉన్నాయి.శర్వా క్రేజ్ తో పాటు,సినిమా మేకింగ్ స్టైల్ కూడా ఈ సినిమాకి అనుకున్నదానికంటే ఎక్కువ బజ్ రావడానికి కారణం అయ్యింది.అయితే సినిమాలో కథ,కథనం రెండూ ఫ్లాట్ గా సాగిపోవడంతో రణరంగం ముందు చెప్పుకున్న ఫ్యాక్టర్స్ పైనే ఆధారపడాల్సి వచ్చింది.దాంతో సినిమాకి కేవలం యావరేజ్ టాక్ మాత్రమే దక్కింది.

ఎవరు? సినిమాకి అనుకున్నదానికంటే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి.దానికి కారణం శేష్ నుండి గతంలో వచ్చిన క్షణం,గూఢచారి సినిమాలు హిట్ అవ్వడం,ఆలాగే ఎవరు? సినిమాకి ముందు రోజే ప్రీమియర్స్ వెయ్యడం కూడా ఎవరు సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.ఈ సినిమాలో కథనం చాలా ఉత్కంఠభరితంగా ఉండడం,అనుకున్న ట్విస్టులు అన్నీ బాగా పేలడంతో ఎవరు సినిమాకి సూపర్ సక్సెస్ టాక్ ఆల్రెడీ వచ్చేసింది.శేష్ గత సినిమా గూఢచారి మొదట రోజు కలెక్షన్స్ కి రెండింతలు రాబట్టింది ఎవరు?.’A’ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.రణరంగం సినిమా ఓపెనింగ్స్ వరకు ఓకే అనిపించినా ఫైనల్ విన్నర్ మాత్రం ఎవరు? అనేది ట్రేడ్ జడ్జిమెంట్.

 

Consider these articles: