Latest Posts

రాజా సాబ్ షూటింగ్ సెట్ కోసం అంత ఖర్చు పెట్టారా..?

- Advertisement -

Prabhas Raja Saab shooting Set Budget: ఫ్యాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు.. అంతేకాకుండా సినిమా అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడ తగ్గకుండా అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.. ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి మొదటి టీజర్ ని విడుదల చేస్తున్నారు మేకర్స్.

Prabhas Raja Saab shooting Set Budget: అయితే ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్ అంతా ఒక షూటింగ్ సెట్లోనే జరిపారు అన్నట్టు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రొడ్యూసర్స్ సంబంధించిన ప్రాపర్టీ అయిన 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వెయ్యడం జరిగిందంట దీనికిగాను మేకర్స్ దాదాపు 15 కోట్ల పైనే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇది ఒక రికార్డ్ అనే చెప్పవచ్చు ఇంతవరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇంత భారీ సెట్ నిర్మించలేదు..

- Advertisement -

డైరెక్టర్ మారుతి (Maruthi) విజువల్ కి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ దాదాపు రెండు నెలల పాటు కష్టపడి ఈ సెట్ ని నిర్మించడం జరిగిందంట. అయితే మొదటి నుండి ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి లిక్స్ రాకుండా మేకర్స్ చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు.. ఏకంగా సినిమాల నటిస్తున్న ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్స్ కూడా సెట్ లోపలకి తీసుకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ అలాగే మాళవిక మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు అయితే మొట్టమొదటిసారిగా ఈ సినిమాకు సంబంధించిన జోనర్ ఇంతవరకు మేకర్స్ ఎక్కడా ప్రకటించలేదు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు నిర్మిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ఇటీవలనే ప్రకటించారు. బాక్సాఫీస్ వద్ద తన హవాని కొనసాగిస్తున్న ప్రభాస్ (prabhas) ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తాడు చూడాలి.

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles