Gang Leader Movie, Nani , Telugu News
Gang Leader Movie, Nani , Telugu News

‘గ్యాంగ్ లీడర్’ అంటేనే మాస్ కి సింబాలిజమ్. ఇప్పుడు ఇదే టైటిల్ తో నేచురల్ స్టార్ నాని హీరోగా – స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ విక్రమ్ కుమార్ దర్శకుడిగా సెప్టెంబర్‌ 13న రాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ఈ విభిన్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వనుంది. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లతో పాటుగా టీజర్ ట్రైలర్లకు కూడా విశేష స్పందన వచ్చింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల వరకూ ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఓవర్సీస్ లో ఈ గ్యాంగ్ లీడర్ వర్కౌట్ అవుతుందా ? సినిమా టైటిల్ ను బట్టే.. ఆ సినిమా పై ప్రేక్షకులు ఆసక్తి పెంచుకుంటున్న ఈ రోజుల్లో ఎప్పుడో 80 – 90 నాటి కాలం టైటిల్ పెట్టడం ఒకవిధంగా రిస్కే. పైగా ఈ టైటిల్ పై ఇప్పటికే మెగా ఫ్యాన్స్ తీవ్రగంగానే తమ అభ్యంతరం తెలిపారు. దీనికి తోడు టైటిల్ విషయంలో అప్పట్లో నాని పై ట్రోల్ కూడా చేశారు మెగా ఫ్యాన్స్. అయినప్పటికీ ‘గ్యాంగ్ లీడర్’ టీమ్ మాత్రం తమ సినిమాకు అదే టైటిల్ అని తీర్మానం చేసేసింది.

గత సినిమాల అనుభవం రీత్యా ఓవర్సీస్ లో క్లాస్ అండ్ కామిక్ టైటిల్స్ కు ఉండే క్రేజ్.. మాస్ టైటిల్స్ అంత త్వరగా ఉండదు. మరి సినిమా రిజల్ట్ పై.. ఈ టైటిల్ ఎంతటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100′ హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇతర కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రఘుబాబు, సత్య నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.