‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

2400
Vijay Devarakonda World Famous Lover Day 3 box office Collection
Vijay Devarakonda World Famous Lover Day 3 box office Collection

(Vijay Devarakonda World Famous Lover Day 3 box office Collection, first week collection report also check AP/TS collections)రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేసిన లవ్ స్టోరీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి బిలో యావరేజ్ టాక్ రావడంతో మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ రెండవ రోజు 60% డ్రాప్ అయ్యింది. మొదటి షో తోనే ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా.. సెకండ్ హాఫ్ చాలా నీరసంగా సాగిందని ప్రేక్షకులు కామెంట్స్ చేశారు. అయితే ఐశ్వర్య రాజేష్ పోషించిన ‘సువర్ణ’ ట్రాక్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పుకొచ్చారు.

కలెక్షన్ల పరంగా మొదటిరోజు పర్వాలేదు అనిపించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’…. రెండో రోజు నుండీ షాకులివ్వడం మొదలు పెట్టాడు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రానికి 30.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 3 రోజులు పూర్తయ్యేసరికి 8.86 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది . మూడవరోజు ఈ చిత్రం కేవలం 1.37 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 21.64 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి మొదటివారం పూర్తయ్యేసరికి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

నైజాం 3.66 cr
సీడెడ్ 0.66 cr
ఉత్తరాంధ్ర 0.79 cr
ఈస్ట్ 0.48 cr
వెస్ట్ 0.37 cr
కృష్ణా 0.40 cr
గుంటూరు 0.62 cr
నెల్లూరు 0.26 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.68 cr
ఓవర్సీస్ 0.94 cr
వరల్డ్ వైడ్ టోటల్ 8.86 cr (share)