“వరల్డ్ ఫేమస్ లవర్” రివ్యూ & రేటింగ్!

1911
Vijay Devarakonda World Famous Lover Review Rating
Vijay Devarakonda World Famous Lover Review Rating

“వరల్డ్ ఫేమస్ లవర్” రివ్యూ & రేటింగ్!
రేటింగ్: 2/5
నటీనటులు : విజయ్ దేవరకొండ, రాశీఖన్నా, క్యాథరిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేశ్‌, ఇజబెల్లా తదితరులు
దర్శకత్వం : క్రాంతి మాధవ్‌
సంగీతం : గోపీ సుందర్‌
కెమెరా : జయకృష్ణ గుమ్మడి
ఎడిటింగ్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు : కె.ఎ.వల్లభ
బ్యానర్‌ : క్రియేటివ్ కమర్షియల్స్‌

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ `పెళ్ళిచూపులు`, `అర్జున్‌రెడ్డి`, `గీత గోవిందం` చిత్రాలతో సూపర్ హిట్ లను అందుకున్న విషయం తెలిసిందే. ఇపుడు వరల్డ్ ఫేమస్ లవర్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో తిరిగి వచ్చాడు. డియర్ కామ్రేడ్’ డిజాస్టర్ అనంతరం విజయ్ దేవరకొండ చిన్నపాటి విరామం తీసుకొని విడుదల చేస్తున్న సినిమా ఇది.. ఇదే తన చివర ప్రేమకథా చిత్రమంటూ వాలైంటైన్స్ డే రోజున అంటే ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరి ఈ సినిమా ఎలా ఉందో ? మళ్ళీ విజయ్ మ్యాజిక్ ను రిపీట్ చేశాడా. లేదా ? తెలుసుకుందాం.

స్టోరీ:

గౌతమ్ (విజయ్ దేవరకొండ) ఓ అనాథ. కాలేజీలో యామిని (రాశిఖన్నా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే గౌతమ్ పెద్ద రైటర్ కావాలనుకుంటారు. ఈ నేపథ్యంలోనే అతనికి మంచి జీతంతో జాబ్ రావడం, ఆ తరువాత యామిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోకపోవడం. వాళ్ళు ఒప్పుకునే వరకూ వీళ్ళు సహజీవనం చేద్దామని డిసైడ్ కావడం జరుగుతుంది. మొదట్లో గౌతమ్ రైటర్ గా ఏదైనా సాధిస్తాడనే నమ్మకంతో అతడ్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన యామిని.. ఏడాదిన్నరపాటు అతడు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం, సినిమాలు చూడడం, తన కామాగ్ని చల్లార్చుకోవడం కోసం తన దేహాన్ని వాడుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని భావించిన యామిని గౌతమ్ కి బ్రేకప్ చెబుతుంది.

ఆ తరువాత కథలపై ఇంటరెస్ట్ తో యామినిని నిర్లక్ష్యం చేస్తాడు. దీంతో యామిని బ్రేకప్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు గౌతమ్ ఏం చేశాడు ? అసలు సీనయ్య (విజయ్ దేవరకొండ), సువర్ణ (ఐశ్వర్య రాజేష్), స్మిత మేడమ్ (కేథరిన్) వీళ్లంతా ఎవరు ? వీళ్లకు గౌతమ్, యామినీలకు ఉన్న సంబంధం ఏమిటి ? అసలు గౌతమ్ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ? చివరకు ఏం జరిగింది ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :

విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో నాలుగు రకాల పాత్రల్లో కన్పించాడు. నాలుగు పాత్రలు కూడా విభిన్నమైనవే. గౌతమ్ పాత్రలో అర్జున్ రెడ్డిని తలపిస్తాడు. కాలేజ్ స్టూడెంట్ గా , గ్రామీణ నేపథ్యం కలిగిన యువకుడిగా, ఫారిన్ లో ఇలా అన్ని పాత్రల్లో ఒదిగిపోయాడు.

ఇక హీరోయిన్ల విషయానికొస్తే. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఐశ్వర్య రాజేష్ గురించి. ఆమె మినిమల్ మేకప్ తో, చీరకట్టుతో సాధారణ మహిళగా. ఆమె అభినయానికి ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. యామినిగా రాశిఖన్నా, స్మితగా కేథరీన్, ఇజా పాత్రలో ఇజాబెల్లె ఆకట్టుకున్నారు. ప్రియదర్శి ఫ్రెండ్ రోల్ రెగ్యులర్ గానే ఉంది.

సాంకేతిక వర్గం పనితీరు :

దర్శకుడు బ్రేకప్ తరువాత ఇద్దరు ప్రేమికుల మనోభావాల ఆధారంగా కథను తెరకెక్కించారు. అయితే ప్రథమార్ధాన్ని చక్కగా ఉంది. కానీ సెకండాఫ్ నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. గోపి సుందర్ బాణీలు పెద్దగా ఆకట్టుకోవు. పిక్చరైజేషన్ పరంగా కానీ ఆకట్టుకోలేకపోయింది. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ వర్క్ ప్రొడక్షన్ వేల్యూస్ ఎలివేట్ చేసింది కానీ.. ఎమోషనల్ ఎలివేషన్స్ ను సరిగా తెరపై చూపలేకపోయింది. నిర్మాణ విలువల విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే ప్రేమికుల దినోత్సవం రోజున సందర్భంగా కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కి విడుదల కాబడిన “వరల్డ్ ఫేమస్ లవర్” నిరాశపరిచింది. విజయ్ ఇప్పటి వరకు నటించిన చిత్రాలతో పోల్చుకున్నట్టయితే ఈ చిత్రానికి ఏమంత భారీ బజ్ ఏర్పడలేదు.అయినప్పటికీ విజయ్ తనదైన ప్రమోషన్స్ తో విడుదల రోజుకు సరిపడా హైప్ ను తెచ్చుకున్నాడు. ట్రైలర్ చూసి సినిమాలో ఏదో ఉంటుంది అని ఊహించి థియేటర్లకు వెళ్తే మాత్రం పూర్తిస్థాయిలో నిరాశ చెందే చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. విజయ్,ఐశ్వర్య మరియు రాశీ ఖన్నాల మధ్య ఎమోషనల్ ట్రాక్స్ పండినా సరైన స్క్రీన్ ప్లే మరియు ఆకట్టునే కథనాలు లేకపోవడం మూలాన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్ గా నిలిచిపోవచ్చు.