`118` వంటి సూపర్‌హిట్ చిత్రాన్నితెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు`(ఎవరు, ఎక్కడ, ఎందుకు). అథిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. మకర సంక్రాంతి పండగ సందర్భంగా `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు` మూవీ టీజర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.
నాకు ఇష్టమైన టెక్నీషియన్స్‌లో కేవి గుహన్ గారు ఒకరు. ఆయనతో చాలా మంచి సినిమాలకు వర్క్ చేశాను. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన `డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు`టీజర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. టీజర్ చూశాను చాలా బాగుంది సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్“ మహేష్‌బాబు అన్నారు.
అథిత్ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
బ్యానర్: రామంత్ర క్రియేషన్స్,
సంగీతం: సిమన్ కె. కింగ్,
ఎడిటింగ్: తమ్మిరాజు,
ఆర్ట్: నిఖిల్ హసన్,
డైలాగ్స్: మిర్చి కిరణ్,
లిరిక్స్: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్,
కొరియోగ్రఫి: ప్రేమ్ రక్షిత్,
స్టంట్స్: రియల్ సతీష్,
కాస్ట్యూమ్ డిజైనర్: పొన్మని గుహన్,
ప్రొడక్షన్ కంట్రోలర్: కె. రవి కుమార్,
కో-ప్రొడ్యూసర్: విజయ్ ధరణ్ దాట్ల,
నిర్మాత: డా. రవి పి.రాజు దాట్ల,
కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్.