KGF Chapter 2 Release Date: కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!

0
40
Yash KGF Chapter 2 New Release Date Confirmed

KGF Chapter 2 Release Date: సినీ ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ వాంటెడ్ సినిమాలలో Yash ‘కేజీఎఫ్2’ (KGF2) కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో RRR స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది కేజీఎఫ్2 (KGF2) అనే చెప్పాలి. ఈ సినిమా దెబ్బతో కన్నడ సినిమా ఖ్యాతి భారతదేశానికే కాక కొన్ని ఇతర దేశాలకు కూడా పాకింది. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్2’ (KGF2) కొత్త రిలీజ్ డేట్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాను ముందు అనుకున్నట్లుగా జూలై 16 న రిలీజ్ చేయాలి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో సరైన విడుదల తేది కోసం ఎదురుచూస్తున్న తమ సెంటిమెంట్ డేట్ గుర్తుకువచ్చింది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేజీఎఫ్2 (KGF2) ని మొదటి పార్ట్ రిలీజ్ డేట్ అనగా క్రిస్మస్ హాలిడేస్ లోనే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట.

2018 డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన కే జి ఎఫ్ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఈ సినిమా దెబ్బతో కన్నడ సినిమా కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.హోంబలే ప్రొడక్షన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా కన్నడ తో పాటూ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.