KGF రేంజ్ పెరిగిపోయిందిగా

Yash KGF Chapter2 Adheera Sanjay Dutt New look, Release date
Yash KGF Chapter2 Adheera Sanjay Dutt New look, Release date

సౌత్ ఇండియాలో లోయర్ స్టాండర్డ్స్ అని పేరున్న శాండల్ వుడ్ లో తెరకెక్కి,పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన KGF సాధించిన విజయం గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు.కన్నడ వరకే స్టార్ హీరోగా ఉన్న యష్ కి ఇండియా వైడ్ గా పేరు,పేరుతోపాటే మార్కెట్ కూడా తీసుకువచ్చింది.పెద్దగా అంచనాలు లేకుండానే అతి భారీ విజయం సాధించిన ఈ సినిమా సెకండ్ పార్ట్ అంటే ఎంత హైప్ ఉంటుందో అందరికంటే ఈ సినిమా టీమ్ కి బాగా తెలుసు.అందుకే KGF సెకండ్ చాప్టర్ ని వీలైనంత భారీ సినిమాగా మలుస్తున్నారు.

సెకండ్ పార్ట్ కి ఆకర్షణగా నిలిచిన పాత్ర.అధీరా…మరి అంత వెయిట్ ఉన్న పాత్రను పోషించడానికి అంతే వెయిట్ ఉన్న హీరో ని తీసుకున్నారు.బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ అధీరా గా అదరగొట్టబోతున్నాడు.గతంలో అగ్నిపథ్ లో కూడా తన ఆహార్యంతో అందరిని భయపెట్టిన సంజయ్ దత్ ఈ సినిమాలో ఫుల్ ప్లెడ్జెడ్ విలన్ గా అలరించనున్నాడు.ఈ ఒక్క అప్డేట్ చాలు KGF సెకండ్ చాప్టర్ స్థాయిని పది రెట్లు పదిరెట్లు పెంచడానికి.KGF టీమ్ కూడా బాలీవుడ్ మార్కెట్ ని మేజర్ కమర్షియల్ సోర్స్ గా ఫిక్స్ అయ్యింది.భారీతనంతో పాటు,భారీ తారాగణం తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది చూడాలి.