Yash Resumes Shooting For Kgf Chapter 2 Sanjay Dutt Expected To Join In First Week Of November

kgf chapter 2 shooting: కె.జి.ఎఫ్: చాప్టర్ 2 షూటింగ్ సుమారు ఐదు నెలల విరామం తరవాత ఆగస్టు 26న బెంగళూరులో ప్రారంభమైంది. అయితే, ఈ షెడ్యూల్‌లో హీరో యష్‌తో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి బుధవారం తమ టీమ్‌తో జాయిన్ అయ్యారు. ఇక ఇక్కడి నుంచి లీడ్ పెయిర్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

కాగా, ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం కె.జి.ఎఫ్ టీమ్ హైదరాబాద్ వస్తోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ సెట్‌లో 20 రోజుల పాటు షూటింగ్ జరుగుతుంది. క్లైమాక్స్‌తో పాటు కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు’’ అని ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వ్యక్తి ఒకరు ముంబై మిర్రర్‌కు వెల్లడించారు.

కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అధీరాగా సంజయ్ కనిపించనున్నారు. ‘కె.జి.ఎఫ్: చాప్టర్ 2’లో రాకీ భాయ్, అధీరా మధ్య పెద్ద యుద్ధమే జరగబోతోంది. క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ కోసం నవంబర్ తొలి వారంలో సంజయ్ టీమ్‌తో జాయిన్ అవుతారు’’అని తెలుస్తుంది..

ఇదిలా ఉంటే, నవంబర్‌లో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను మొదలుపెట్టాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. నిజానికి ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయాలని భావించారు. కానీ, లాక్‌డౌన్ వల్ల సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు చూస్తున్నారు.