KGF 3 గురించి యష్ చెప్పిన నిజం..!!

KGF Chpater 3 గురించి సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. కెజియఫ్ సిరీస్ లో ఇప్పటికే రెండు పార్ట్ లు రాగా ఇప్పుడు మూడో పార్ట్ కూడా వస్తుంది అని బాలీవుడ్ సర్కిల్ లో న్యూస్ వైరల్ అవుతుంది. యష్ ఇటీవల విడుదలైన తన చిత్రం KGF: చాప్టర్ 2 విజయంతో దూసుకుపోతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF: చాప్టర్ 2 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ ని ధాటి దూసుకు పోతుంది బాక్స్ ఆఫీస్ వధ.

KGF 3 movie details, Yash spills the beans on 'KGF Chapter 3
KGF 3 movie details, Yash spills the beans on ‘KGF Chapter 3

ఇది ఇలా ఉండగా ఇప్పుడు బాలీవుడ్ సెట్టింగ్ కేజిఎఫ్ 3 గురించి న్యూస్ వైరల్ అవుతుంది. కేజిఎఫ్2 విడుదల ఎప్పుడు కూడా డైరెక్టర్ ప్రశాంత్ ని అలాగే హీరో యష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కేజిఎఫ్3 గురించి ఎక్కడా ఎటువంటి సమాచారం అలాగే మాట్లాడలేదు.

కానీ ప్రముఖ హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కి తన తాజా ఇంటర్వ్యూలో, హీరో యష్ ప్రేక్షకులకు చెప్పడానికి చాలా కథలు మిగిలి ఉన్నందున KGF 3 అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు.

“కెజిఎఫ్ 2 చేస్తున్నప్పుడు, ప్రేక్షకులకు చెప్పడానికి ఇంకా చాలా ఉందని మేము అర్థం చేసుకున్నాము మరియు పార్ట్ 3 బయటకు వచ్చేలా దానికి సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని అలాగే కథని కొంతవరకు వదిలేయటం జరుగుతుంది. అయితే ఈ కథ KGF 2 తో సంబంధం లేకుండా ఉంటుంది, ఖచ్చితంగా మూడవ భాగం వస్తుంది, అయితే ఎప్పుడు అనేది మేము ఖచ్చితంగా చెప్పలేము, ”అని యష్ తన ఇంటర్వ్యూలో అన్నారు.

Yash KGF 3 movie on cards
Yash KGF 3 movie on cards

దీనిని బట్టి ఈ సిరీస్ కంటిన్యూ అవుతుందని తెలుస్తుంది అలాగే హీరో యష్ ఇంకో కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు భాషలతో సంబంధం లేకుండా కేజిఎఫ్ కానీ RRR movie ఇండియన్ సినిమా లెవల్లో ఎదిగాయి అని చెప్పడం జరిగింది.

 

Web Title: Yash reveals his plans for KGF Chapter 3.. KGF 3 movie on cards, KGF 3 movie details, Yash spills the beans on ‘KGF: Chapter 3

Related Articles

Telugu Articles

Movie Articles