Yashoda Day 1 Collections: సమంత నటించిన యశోద మూవీ ఈ రోజు విడుదల అవ్వడం జరిగింది. తొలి రోజే యశోద చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.
Yashoda Day 1 Collections: సమంత నటించిన యాక్షన్ థ్రిల్లర్ యశోద విడుదల కాకముందే ట్రైలర్ అలాగే టీజర్ తో అందర్నీ ఆకర్షించే చెట్టు చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన యశోద మూవీ మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి సినిమా అని పేరు రావడంతో బాక్సాఫీస్ వద్ద యశోద కలక్షన్స్ వర్షం కురిపిస్తుంది అని భావిస్తున్నారు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, మొదటి రోజు యశోద (Yashoda Collection) సినిమాకి దేశవ్యాప్తంగా 3.20 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది అని చెబుతున్నారు. వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సమంత యశోద సినిమా మొత్తం మీద 30 నుండి 40 కోట్ల మధ్యలో రాబడుతుంది అని అంచనా వేస్తున్నారు.
యశోద సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాకి ప్రముఖ ఓటీటీ సంస్థ డిజటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్టు సమాచారం. సమంత యశోద సినిమాని ప్రముఖ ఐటి సంస్థ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకుంది.
అయితే యశోద సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్ రావడంతో ఈ సినిమాని ఐదు లేదా ఆరు వారాల తర్వాత ఓటీటీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద సమంత తన నటనతో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది.