పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందించిన నిఖిల్..!

0
390
Young Hero Nikhil Sensational Comments over petrol price hike Tweet going viral

18 pages Actor Nikhil: ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలో పెట్రోల్ ధరలు పెరగడం ఒకటి. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా చితికి పోతున్న మధ్యతరగతి ప్రజల పరిస్థితి పెరిగిపోతున్న పెట్రోల్ ధరలతో అగమ్యగోచరంగా మారిపోతుంది. ఇక ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి అన్న విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. ఆంధ్రప్రదేశ్ లో లీటరు పెట్రోలు ధర 106 రూపాయలుగా ఉంది. తెలంగాణలో 104 రూపాయలుగా ఉంది. దాదాపు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా టాలీవుడ్ యువ హీరో పెట్రోల్ ధర పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘అసలేం జరుగుతోందిఝ 35 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్ డీజిల్ ధర.. ఇప్పుడు బంకులలో ఉండే పంపుల వద్ద 100 రూపాయలు దాటేసింది. ఇంధన ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్స్ లను వెంటనే రద్దు చేయాలి. ఇలా నిత్యం ధరలు పెరిగిపోవడం కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరి తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని నిఖిల్ రాశారు.

నిఖిల్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్. నిజానికి.. ఒక్క రూపాయి డీజిల్ పెట్రోల్ ధర పెరిగిందంటే.. అది ఆయిల్ మీద మాత్రమే పెరిగినట్టు కాదు. కూరగాయలు బియ్యం పాలు వంట నూనె ఇలా.. అన్ని నిత్యావసర సరుకుల మీద కూడా పుడుతుంది.