సినీ నటుడు ప్రభాస్ (Prabhas Adopts Forest) అర్బన్ ఫారెస్ట్ పార్క్ నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకొని అర్బన్ ఫారెస్ట్ పార్క్‌గా డెవలప్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా జాతీయస్థా యి గుర్తింపు పొందాడు. అలాగే ప్రభాస్ సేవా గుణం గురించి తెలుగు ప్రజలందరికి తెలుసు. కరోనా సమయంలో సీఎం సహాయ నిధికి, పీఎం సహాయనిధికి భారీ విరాళం ఇచ్చాడు డార్లింగ్.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమాన్ని సినీ నటుడు ప్రభాస్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభాస్‌. వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని అప్పట్లో ప్రకటించారు. ప్రభాస్ చెప్పినట్టుగానే హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్న ఖాజీపల్లి అనే గ్రామంలో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ను దత్తత తీసుకున్నారు.

Prabhas adopts 1,650 acres of forest land

ప్రభాస్ తీసుకున్న నిర్ణయంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి రానుంది. తండ్రి దివంగత ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణరాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతాన్ని ప్రభాస్ అభివృద్ధి చేయనున్నాడు. ప్రస్తుతానికి రెండు కోట్ల రూపాయలు అందించిన ప్రభాస్.. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Prabhas adopts 1,650 acres of forest land

ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కుకు సోమవారం శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన అనంతరం ప్రభాస్, ఎంపీ సంతోష్ కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.