Mammootty, YSR, Yatra Movie Review, Tollywood Movie Review
Mammootty, YSR, Yatra Movie Review, Tollywood Movie Review

విడుదల తేదీ : ఫిబ్రవరి 08, 2019
చిత్రంభలరే .ఇన్  రేటింగ్ : 3.25/5
నటీనటులు : మమ్ముట్టి, జగపతిబాబు, సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ తదితరులు.
దర్శకత్వం : మహి.వి.రాఘవ్
నిర్మాతలు : విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి
సంగీతం : కృష్ణ కుమార్
సినిమాటోగ్రఫర్ : సత్యన్ సూర్యన్
ఎడిటర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్రా

జకీయాలకు అతీతంగా ..జననేతగా.. చాలా మంది మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వై.ఎస్ రాజశేఖర రెడ్డి.అలాంటి ఓ మహానేత జీవితంలోని అత్యంత కీలక ఘట్టాన్ని తెరమీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు అనగానే అందరిలో ఆసక్తి కలిగింది. దానికి తోడు వై.ఎస్ .ఆర్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నాడు అనగానే..సినిమాపై మరింత ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ఫస్ట్ లుక్ , టీజర్స్, ట్రైలర్స్ తో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఎగ్సైట్ మెంట్ ఏర్పడింది. పొలిటికల్ సపోర్ట్ కూడా కలిసి రావడంతో ఫుల్ బజ్ క్రియేట్ చేసుకుని థియేటర్స్ లోకి వచ్చింది యాత్ర. మరి ఈ యాత్ర విజయం వైపు సాగిందా..? లేక పరాజయంగా మిగిలిపోయిందా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:

కడపలో ప్రాంతీయ నేతగా బలమైన అభిమాన గణం మరియు కార్యకర్తల అండదండలు ఉన్న వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ముందస్తుగా వచ్చిన ఎన్నికలను ఎదుర్కొనే బలంలేదు డీలా పడతాడు. తనతండ్రికి ఇచ్చిన మాటకూడా నిలబెట్టుకోలేను అనే నిర్ణయానికి వచ్చేస్తాడు.కానీ ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకం,విశ్వాసం రాజశేఖర రెడ్డిలో ప్రజల కన్నీళ్లు తుడవాలి అనే కసిని రేకెత్తిస్తాయి.

దాంతో..పాదయాత్ర మొదలుపెట్టి కడపదాటి..ప్రతి గడపలోకి వెళ్లి..ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని అక్కడికక్కడే వాళ్లకు మంచి చేసే సంక్షేమ పథకాలను రూపొందిస్తూ..ప్రజలలో నేనున్నాననే నమ్మకాన్ని నిలుపుతూ..అధికారపీఠాన్ని కైవసం చేసుకుంటారు.2009 ఎన్నికల నాటి ఈ పాయింట్ నే కొర్ కథగా పెట్టుకుని ఈ సినిమా రూపొందించారు.

నటీనటులు:

ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి దాన్ని జనాలకు గుర్తుండిపోయేలా తెరమీద ఆవిష్కరించే మమ్ముట్టి..ఈ సినిమాకు అదే తరహా మ్యాజిక్ రిపీట్ చేశాడు.హావభావాలు, నడిచేపద్దతి అన్నింటిలో వై.ఎస్ నే గుర్తు చేశాడు. డబ్బింగ్ పరంగా అక్కడక్కడా పట్టి పట్టి మాట్లాడినట్టు అనిపించినా.. సినిమా సాగుతున్న కొద్దీ తానే వై.ఎస్ అని నమ్మించేశాడు.ఈ సినిమాకి అతి పెద్ద ఎసెట్ మమ్ముట్టి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వై.ఎస్ ఆత్మ బంధువుగా, ఆత్మీయుడిగా అందరికీ తెలిసిన కె.వి.పి పాత్రలో రావు రమేష్ అచ్చుగుద్దినట్టు సరిపోయాడు.ఇక జగపతిబాబు,సుహాసిని,అనసూయ,ఛత్రపతి శేఖర్,దిల్ రమే,నాగినీడు,ఆశ్రిత వీళ్లంతా ఒకటీ..రెండు సీన్స్ లో కనిపించినా..ఆ సీన్స్ సినిమాకి కీలకం కావడంతో గుర్తుండిపోయేలా ప్రేక్షకులకు కనెక్ట్ చెయ్యగలిగాడు.పృధ్వి,సచిన్ఖేద్కర్, పోసాని,జీవా,వినోద్ కుమార్,తోటపల్లి మధు తదితరులంతా…కాంటెంపరరీ పొలిటీషియన్స్ గా తమ షేడ్స్ నిపరిపూర్ణంగా పోషించి మెప్పించారు.

టెక్నీషియన్స్:

వై.ఎస్ అభిమానిగా సినిమా స్టార్ట్ చేసిన మహి.వి. రాఘవ స్క్రిప్ట్ మీద చాల వర్క్ చేశాడు అని సినిమాని చూస్తే అర్దం అవుతుంది.చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ గా కన్వే చేశాడు. ఫస్టాఫ్ వరకూ ఎక్కడా తడబడకుండా చకచకాసాగిపోయిన యాత్ర..సెకండాఫ్ కి వచ్చేసరికి మాత్రం కాస్త డల్ అయ్యింది.

పూర్తిగా పొలిటికల్ కలర్ ఉన్న సినిమా కావడంతో పాటలు ఎక్కువగా ఉండడం..కొన్ని రిపిట్ సీన్స్ లాంటివి సినిమా వేగాన్ని తగ్గించాయి. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి కుదురుకున్న డైరెక్టర్ హెవీ ఎమోషనల్ ఎపిసోడ్ తో సినిమా ఎండ్ చేసాడు.సినిమా చివర్లో చూపించిన ఒరిజినల్ ఫుటేజ్ అభిమానుల్ని ఎమోషనల్ గా కదిలించింది. కాకపోతే.. ప్రతిపక్షం పై అవసరంలేని సెటైర్స్ ,లాస్ట్ లో వై.ఎస్ జగన్ ని ప్రొజెక్ట్ చెయ్యడం లాంటివి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ నుంచి పొలిటిక్ సైడ్ కి కాస్త డీవియేట్ చేసినట్టు అనిపించింది.

సత్యసూర్యన్ సినమాటోగ్రఫీ సినమాకు జీవం పోసింది. అతను వాడిన టింట్ అండ్ షార్ట్ కంపొజిషన్ సినిమాకు కావల్సిన షార్ప్ నెస్ ను తీసుకొచ్చాయి.ప్రతిసీన్ లో కంటెంట్ బాగా ఎలివేట్ అయ్యింది.కె… మ్యూజిక్ కూడా సినిమా థీమ్ ని,కంటెంట్ ని డ్రైవ్ చేసేవిధంగా ఉంది.పెంచల్ దాస్ పాడిన పాట..క్లైమాక్స్ కి వెయిట్ పెంచి పర్ఫెక్ట్ ఎండింగ్ అనిపించింది.విజయ్, శశిధర్ రెడ్డి ల నిర్మాణవిలువలు బావున్నాయి.

ఫైనల్ గా:

వై.ఎస్.ఆర్ కి ట్రిబ్యూట్ గా తెరకెక్కిన యాత్ర..కాస్తో,..కూస్తో పొలిటికల్ రంగు పులుముకున్నా కూడా ఒక సిన్సియర్ ఎటెంప్ట్ గా నిలిచింది. స్లో నెరేషన్, కొన్ని ల్యాగింగ్ సీన్స్ మినహాయిస్తే..ఓవరాల్ సినిమాటిక్ఎక్స్ పీరియన్స్ ఓ.కే అనిపిస్తుంది. వై.ఎస్ ఫాలోయర్స్ కి అమితంగా కనెక్ట్ అయ్యే అంశాలున్న ఈ సినిమా రెగ్యులర్ ఆడియన్స్ ని,యూత్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.ఆ ఫ్యాక్టరే ఈ సినిమా సక్సెస్ రేంజ్ ని నిర్ణయిస్తుంది.

బోటమ్ లైన్: యాత్ర…YSR ఎమోషనల్ జర్నీ