Zareen Khan Mehreen Pirzada Hopes On Gopichand Chanakya Movie
Zareen Khan Mehreen Pirzada Hopes On Gopichand Chanakya Movie

గోపీచంద్ చాణక్య పై గోపీచంద్ తో బబ్లీ గర్ల్ మెహరీన్.. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జరీన్ ఖాన్ కూడా చాలానే ఆశలు పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా హిట్ అయితేనే గోపీచంద్ కి మార్కెట్ నిలబడుతోంది. ఇక ‘ఎఫ్ 2’ తో భారీ హిట్ కొట్టినా, మెహరీన్ కి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు.

దాంతో చాణక్య సినిమా ఆమె కెరీర్ కి కీలకం కానుంది. అలాగే జరీన్ ఖాన్ పరిస్థితి కూడా ఇదే. బాలీవుడ్ లో హద్దులు లేకుండా అందాలు ఆరబోసినా అమ్మడికి అవకాశం ఇచ్చే నాధుడే లేకుండా పోయాడు హిందీ సినిమాల్లో. ఇలాంటి టైంలో వచ్చిన ఛాన్సే గోపీచంద్ చాణక్య మూవీ. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో రెచ్చిపొయిందట ఈ హాట్ బ్యూటీ. అయితే జరీన్ ఖాన్ ఎంత రెచ్చిపోయినా ఆమెకు మాత్రం కాలం కలిసి రాదు అని ఇప్పటికే బాలీవుడ్ లో ఓ పేరు ఉంది. మరి ఈ చిత్రంతో జరీన్ ఖాన్ టాలీవుడ్ లో ఎంతవరకు నిలబడగలుగుతుందో చూడాలి. అలాగే గోపీచంద్ కి, మెహరీన్.కి కూడా చాణక్య ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి. .

ఇక యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో వస్తోన్న ఈ యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ అక్టోబర్ 5న విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయని అలాగే ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్ ను ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.