HomeOTT తెలుగు మూవీస్Vyavastha Trailer: సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ విడుద‌లైన జీ 5 ఒరిజిన‌ల్ ‘వ్యవస్థ’ ట్రైల‌ర్‌

Vyavastha Trailer: సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ విడుద‌లైన జీ 5 ఒరిజిన‌ల్ ‘వ్యవస్థ’ ట్రైల‌ర్‌

ZEE 5 OTT New web series Vyavastha Trailer Released, ZEE 5 OTT New Web Series release dates, Vyavastha web series Trailer, Vyavastha Series Release Date

Vyavastha Web Series Trailer: జీ 5లో ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న వ్యవస్థ సిరీస్‌ను ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెర‌కెక్కించారు. ఇంత‌కు ఆయ‌న జీ 5లో వ‌చ్చి ‘షూట్ ఔట్ ఎట్ అలేర్’ సిరీస్‌ను తెర‌కెక్కించారు. కార్తీక్ ర‌త్నం, సంప‌త్ రాజ్‌, హెబ్బా ప‌టేల్‌, కామ్నా జెఠ్మ‌లానీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారులు. వ్య‌వ‌వ‌స్థ‌ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ స్టార్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చేతుల మీదుగా జీ 5 గురువారం విడుద‌ల చేసింది.

Vyavastha Web Series Trailer: అందులో ఈరోజు న్యాయం రేప‌టి క్రైమ్ అయితే నేటి క్రైమ్ రేప‌టి చ‌ట్టం అవుతుంది అని ఓ లా కోర్సు ట్రైన‌ర్ త‌న స్టూడెంట్స్‌కు చెప్ప‌టంతో ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది. సంప‌త్ రాజ్ ఇందులో చ‌క్ర‌వ‌ర్తి అనే చాలా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో చేసిన‌ట్లు తెలుస్తుంది. సిటీలోని లాయ‌ర్స్ అంద‌రూ త‌న జూనియ‌ర్స్‌గా నియ‌మించుకుని వార‌పై అజ‌మాయిషీ సంపాదించ‌టం ద్వారా త‌ను చెప్పిందే జ‌రగాల‌నుకునే వ్య‌క్తిగా క‌నిపిస్తారు.

ZEE 5 OTT New web series Vyavastha Trailer Released

యువ న‌టుడు కార్తీక్ ర‌త్నం ఇందులో కొన్ని నియమ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ప‌ని చేసే మంచి మ‌న‌సున్న జూనియ‌ర్ లాయ‌ర్ వంశీ పాత్ర‌ను పోషించారు. తను న‌త్తి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటాడు. దీని వ‌ల్ల త‌న‌ని తాను త‌క్కువ‌గా ఊహించుకుంటుంటాడు. అయితే త‌ను హ‌త్యా నేరం మోప‌బ‌డిన యామిని అనే అమ్మాయిని కాపాడాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుంటాడు. ఈ క్ర‌మంలో సిటీలోనే అతి పెద్ద లాయ‌ర్‌గా పేరు తెచ్చుకున్న చ‌క్ర‌వ‌ర్తితో త‌ల‌ప‌డాల్సి వ‌స్తుంది. స‌మాజంలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల నుంచి యామినిని కాపాడ‌టానికి ఆమెకు అండ‌గా నిల‌బ‌డ‌తాడు.

ఇందులో యామిని పాత్ర‌ను హెబ్బా ప‌టేల్ పోషించింది. తన పాత్ర అసాధార‌ణంగా ఉండ‌బోతుంద‌న‌టంలో సందేహం లేదు. అది ట్రైల‌ర్‌లో స్ప‌ష్టంగా తెలుస్తుంది. గాయ‌త్రి అనే పాత్ర‌లో కామ్నా జెఠ్మ‌లానీ క‌నిపించ‌నుంది. లా కాలేజ్‌లోనూ కొంత క‌థ న‌డుస్తుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో పాటు తెలియ‌ని ఆస‌క్తిని పెంచే థ్రిల్లింగ్ స‌న్నివేశాల‌న్నీ ఈ ఒరిజిన‌ల్‌లో ఉండ‌బోతున్నాయి. ఏప్రిల్ 28 నుంచి వ్య‌వ‌స్థ ఒరిజిన‌ల్ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -

 

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY