రూ.6 కోట్లకు ‘వరుడు కావలెను’ డిజిటల్ హక్కులు

167
zee-bags-naga-shourya-upcoming-movie-varudu-kavalenu-digital-rights
zee-bags-naga-shourya-upcoming-movie-varudu-kavalenu-digital-rights

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అతడి తాజా సినిమా ‘వరుడు కావలెను’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రితు వర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తెలుగు వెండి తెరకు పరిచయం కానున్నారు.

 

 

ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను ప్రముఖ సంస్థ జీ తెలుగు సొంతం చేసుకుంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా హక్కులను జీతెలుగు వారు దాదాపు రూ.6 కోట్లకు కొనుగోలు చేశారు.

 

 

ఈ సినిమా చిత్రీకరణ ఇంకా జరుగుతోంది. ఇందులో మరళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్ తదితరులు ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. వరుడు కావలెను సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.