అవికా గోర్ వెబ్ సిరీస్‌ ‘నెట్’ టీజర్ విడుదల..!

0
27
ZEE5 original Release NET Web Series Teaser

NET Teaser Out: వివిధ భారతీయ భాషల్లో, వివిధ జానర్లలో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ముఖ్యంగా ఒరిజినల్ మూవీస్ అందిస్తూ… అత్యధిక వీక్షకాదరణ సొంతం చేసుకున్న అగ్రగామి ఓటీటీ వేదిక ‘జీ 5’. త్వరలో ‘జీ 5’ ఒరిజినల్ మూవీ ‘నెట్’ విడుదల చేయడానికి సిద్ధమైంది.

రాహుల్ రామకృష్ణ, లక్ష్మణ్, అవికా గోర్, ప్రియా, ప్రణీతా పాఠక్, సుచిత్ర, విశ్వదేవ్, రంజిత్ ప్రధాన తారాగణంగా రూపొందిన ‘జీ 5’ ఒరిజినల్ మూవీ ‘నెట్’. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించారు. రాహుల్ తమడా, సందీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. గురువారం ‘నెట్’ టీజర్ విడుదల చేశారు.

Teaser for ZEE5 original movie 'NET' is out

అవికా గోర్ ఒక ఫ్లాట్ లో ఉంటుంది. దాని నిండా సీక్రెట్ కెమెరాలు. ఆమె ఏం చేస్తున్నదీ తన ఫోనులో రాహుల్ రామకృష్ణ చూస్తుంటాడు. ఆఖరికి బాత్‌రూమ్‌కు వెళ్లినా సరే! ఒకరోజు ఫోన్ చూస్తూ ‘మీ ఇంట్లో ఉన్నాడు మీ ఇంట్లో ఉన్నోడు’ అని అరుస్తాడు. అవికా గోర్ ఇంట్లో ఎవరున్నారు? ఏమైంది? అనే అంశాలు వీక్షకుల్లో ఆసక్తి రేపాయి. సెప్టెంబర్ 10న ‘జీ 5’ ఓటీటీ వేదికలో సినిమా ప్రీమియర్ కానుంది.

ఈ చిత్రానికి ఎడిటర్: రవితేజ గిరిజాల, సినిమాటోగ్రాఫర్: అభిరాజ్ నాయర్, మ్యూజిక్: నరేష్ కుమరన్, ప్రొడ్యూసర్స్: రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా, క్రియేటర్ – రైటర్ – స్క్రీన్ ప్లే – డైరెక్టర్ : భార్గవ్ మాచర్ల.