కమెడియన్‌గా, కీలక పాత్రధారిగా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫొటోతో హీరోగా మారి హిట్ కొట్టారు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన మరో చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’ (Writer Padmabhushan). ఆడియన్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో విడుదలైన రోజు నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. చాయ్ బిస్కెట్ ఫిలింస్ వారు ఈ సినిమాని నిర్మించడం జరిగింది. అయితే కొన్ని రోజులుగా రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan) ఓటీటీ (OTT) విడుదలవుతుందని ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని ZEE5 ఓటీటీ (OTT) వారు కొనుగోలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాని మార్చి 17న ZEE5లో విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మహిళల గొప్పతనాన్ని చాటిన ఈ సినిమాను స్ట్రీమింగ్ డేట్‌ను మహిళా దినోత్సవం రోజునే జీ 5 ప్రకటించటం విశేషం.
రైటర్‌గా ఎదగాలనుకుంటున్న యువకుడు.. తన మరదలితో ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి కుదురుతుంది. అంతలోనే మరో వ్యక్తి ఆ అబ్బాయి పేరు మీదర రచనలు చేస్తుంటాడు. అదేవెరనేదే సినిమాలో ప్రధానమైన అంశం. ఇటీవల థియేటర్స్‌లో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఓ వైపు ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మదర్ సెంటిమెంట్ మిక్స్ అయిన మంచి మెసేజ్‌ను ఒరియెంటెడ్ చిత్రంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించిందీ చిత్రం. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా సెలెక్టెడ్ స్క్రీన్స్‌లో ఒక్క రోజు ఫ్రీగా స్పెషల్ షోస్ ప్రదర్శిస్తూ మూవీ టీమ్ చేసిన ప్రమోషన్స్ కూడా ప్లస్ అయ్యాయి. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్ర మనోహర్ సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ సినిమాని ఓటీటీ చూసేందుకు ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కి ఇది శుభవార్త అని చెప్పవచ్చు.