OTT News: ‘జీ 5’లో జూలై 9న ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌ టెంపుల్‌ అటాక్‌’ విడుదల

0
46
ZEE5 Set to Premiere Original Film 'State Of Siege Temple Attack' On 9th July

ZEE5 OTT: State of Siege: Temple Attack: ప్రపంచవ్యాప్తంగా భారతీయ కంటెంట్ కోరుకునే వీక్షకుల కోసం వివిధ భాషలు, వివిధ జోనర్లలో అర్థవంతమైన, ప్రయోజనకరమైన కంటెంట్‌ అందించే భారతదేశపు అతి పెద్ద ఓటీటీ వేదిక ‘జీ 5’. వినోదం, దేశభక్తికి ‘జీ 5’ పెద్దపీట వేస్తుంది. 26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళిగా ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌ : 26/11’ అందించింది.

అది వీక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో పాటు విజయవంతమైన సిరీస్ గా పేరు తెచ్చుకుంది. ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌’ (State of Siege) ఫ్రాంచైజీలో రెండో సీజన్ ‘స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్‌ అటాక్‌’ను ఒరిజినల్ మూవీగా తెరకెక్కించారు. ‘జీ 5’ ఒరిజినల్ మూవీ ‘స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్‌ అటాక్‌’ మరికొన్ని గంటల్లో ‘జీ 5’ ఓటిటి వేదికలో విడుదల కానుంది. జూలై 9… అనగా శుక్రవారం హిందీ, తమిళ్‌, తెలుగులో ఏకకాలంలో ప్రదర్శించనున్నారు.

వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందించిన ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌’ మన భారత సైనికులకు నివాళి. భారతీయుల ధైర్యానికి వందనం ఇది. ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌’ ఫ్రాంచైజీలో మరిన్ని చిత్రాలు రానున్నాయని ‘జీ 5’ వర్గాలు తెలిపాయి.