Homeట్రెండింగ్జాంబిరెడ్డి రివ్యూ : ఫన్ అండ్ థ్రిల్లింగ్ గా సాగే జాంబిల డ్రామా...

జాంబిరెడ్డి రివ్యూ : ఫన్ అండ్ థ్రిల్లింగ్ గా సాగే జాంబిల డ్రామా !

నటీనటులు : తేజ సజ్జా, ఆనందీ, దక్ష నగర్కర్, రఘు బాబు, గెటప్ శ్రీను, హర్షవర్ధన్, హేమంత్, హరి తేజ.

దర్శకత్వం : ప్రశాంత్ వర్మ

నిర్మాత‌లు : రాజ్ శేఖర్ వర్మ

సంగీతం : మార్క్ కె రాబిన్

సినిమాటోగ్రఫీ : అనిత్

ఎడిటింగ్ : సాయి బాబు

- Advertisement -

 

హాలీవుడ్ లోనూ, బాలీవుడ్ లోనూ జాంబీజానర్ చిత్రాలకు కొదవలేదు. ఇటీవల అది దక్షిణాదికి కూడా పాకింది. ముఖ్యంగా తమిళంలో ఈ జానర్ చిత్రాలను అగ్ర కథానాయకులు సైతం చేస్తున్నారు. కానీ టాలీవుడ్ సంగతి వేరు! మన హీరోలు ఇలాంటి జానర్ ను టచ్ చేయడానికి కాస్తంత ముందు వెనకా ఆడుతుంటారు. నిజానికి హారర్ మూవీస్ చేయడానికి కూడా మన స్టార్ హీరోలు కొంత జంకుతారు. నవరస సమ్మిళతమయ్యే కథలకు ఇచ్చే ప్రాధాన్యం… పర్టిక్యులర్ గా ఓ జానర్ మూవీకి ఇవ్వడం చాలా అరుదు. బాలనటుడిగా చక్కటి గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా… ఇటీవల ‘ఓ బేబీ’తో మాస్టర్ నుండి మిస్టర్ స్టేటస్ పొందానని తెలియచేశాడు. ఆ సినిమాలో ప్రాధాన్యమున్న పాత్రను పోషించి, మెప్పించాడు. ఇప్పుడు తొలిసారి సోలో హీరోగా ‘జాంబిరెడ్డి’ చిత్రంలో నటించాడు తేజ సజ్జా. మరి తెలుగులో తొలి జాంబి జానర్ మూవీగా ప్రచారం జరుగుతున్న ‘జాంబిరెడ్డి’ కథ ఏంటో తెలుసుకుందాం.

 

 

 

కథ :  మారియో (తేజ సజ్జ)కు గేమ్ డిజైనర్ గా పేరు తెచ్చుకోవాలనే కోరిక. అలా ఓ గేమ్ తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టగానే… దానికి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. అదే సమయంలో గేమ్ హయ్యర్ లెవెల్ లో ఆడుతుంటే కొన్ని సమస్యలు వస్తాయి. దానిని సాల్వ్ చేసే స్నేహితుడు కళ్యాణ్ (హేమంత్) పెళ్ళి చేసుకోవడానికి రాయలసీమ వెళ్ళాడని తెలియడంతో మారియో, అతని మిత్రబృందం కూడా అక్కడికి బయలు దేరతారు. అక్కడ ఏం జరిగింది? మారియో వాళ్ళ స్నేహితులను జాంబీలు ఎందుకు ఎటాక్ చేశావ్? ఆ నడిచే శవాల మధ్య నుండి ఈ గ్యాంగ్ ఎలా బయటపడింది? అన్నది మిగతా కథ.

 

 

ప్లస్ పాయింట్స్ :

‘అ !’, ‘కల్కి’ చిత్రాల తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మూడో సినిమా ‘జాంబిరెడ్డి’. కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ కథను తయారు చేయడమే కాదు… అదే సమయంలో తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. కరోనాకు వాక్సిన్ తయారు చేయాలనుకున్న ఓ మతిచెడిన సైంటిస్ట్ చేసే పిచ్చిపనివల్ల జాంబీ వైరస్ పుట్టడం, అది జనాలను ఎటాక్ చేయడం అనే అంశాన్ని ప్రశాంత్ వర్మ చక్కగా వాడుకున్నాడు. సినిమా పతాక సన్నివేశాలను భక్తికి ముడివేసి మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని దోచుకునే పనిచేశాడు. ఇలాంటి ఫాంటసీ, హారర్ జానర్ చిత్రాలకు ఈ తరహా ముగింపులను మనం అనేక సినిమాల్లో చూశాం. అయితే దానిని కాస్తంత భిన్నంగా ఈ జనరేషన్ కు నచ్చేలా తీశాడు ప్రశాంత్ వర్మ.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేని రాసుకోలేకపోయారు. సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత ఆసక్తి కరంగా సాగని ట్రీట్మెంట్ తో కథను డైవర్ట్ చేశారు. పైగా అనవసరమైన సన్నివేశాలు కూడా ఎక్కువైపోయాయి. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగుతాయి. ఇంటర్వెల్ కి గాని కథ ముందుకు కదలదు.

అయితే సెకెండ్ హాఫ్ లో జాంబీ సీన్స్ అన్ని ఆసక్తికరంగా సాగిన, కొన్ని హారర్ సన్నివేశాలు మాత్రం జస్ట్ పర్వాలేదనిపిస్తాయి. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లాంటి జాంబీ యాక్షన్ హారర్ సీక్వెన్స్ స్ బాగున్నా.. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే సాగతీసినట్లు చాల స్లోగా సాగుతుంది. పైగా సీరియ‌స్ గా ఎమోషనల్ గా సాగే క‌థలో కుళ్లు జోకులు ఇరికించడంతో సినిమా పై ఆసక్తిని చంపేస్తోంది. ఇక బిసి ప్రేక్షకుల ఆశించే ఎలిమెంట్స్, ట్విస్టులు సినిమాలో కావాలని ఇరికించినట్టు ఉంది.

 

 

ఫైనల్‌గా : అలానే ముగింపు సన్నివేశాలలోనూ వినోదాన్ని పంచి ప్రశాంత్ వర్మ సిట్యుయేషనల్ కామెడీని సైతం తాను పండించగలనని నిరూపించుకున్నారు. ఫస్ట్ హాఫ్ మీద మరి కాస్తంత దృష్టి పెట్టి, ద్వితీయార్థంలో జాంబీలతో హీరో బృందం చేసే పోరాట సన్నివేశాలను కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.  నిజానికి ఇది రొటీన్ సినిమా కాదు. అందరూ కోరుకునే నాలుగైదు పాటలు, హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్, కథతో సంబంధం లేని కామెడీ ట్రాక్స్ ఇందులో ఉండవు. ఇలాంటి డిఫరెంట్ జానర్లో సినిమా రావడం ప్రేక్షకులను కాస్త ఆనందాన్నిచ్చే విషయమే.  అయితే… కొత్తదనం కోరుకునే వారికి, హారర్ కామెడీ చిత్రాలను ఇష్టపడే వారికి ‘జాంబిరెడ్డి’ నచ్చుతుంది. మొత్తానికి జాంబీ రెడ్డి సినిమాను థియేటర్ లో ఎంజాయ్ చేస్తూ చూడచ్చు.

 

రేటింగ్ 3.0 / 5

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY