టాలీవుడ్‌లో ప్రభాస్‌కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ఆయనతో మరో హీరోని పోల్చడం అంటే అంత తేలికైన విషయం కాదు. ప్రభాస్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయిన క్షణం నుంచే కలెక్షన్ టార్గెట్లు, పాత రికార్డుల చర్చ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం షరా మామూలే. అయితే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar) సినిమా తర్వాత ప్రభాస్ నుంచి అలాంటి భారీ అంచనాలున్న ప్రాజెక్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే 2026లో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది.
మేకర్స్ ఒక ప్రత్యేక ఈవెంట్‌లో ‘ఫౌజీ’ సినిమాని డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ మరో భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే ఉత్సాహం అభిమానుల్లో నెలకొంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ప్రభాస్ రాబోయే సినిమాలన్నీ పోస్ట్‌పోన్ అయినట్టు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం ప్రస్తుతం మూడు యూనిట్లతో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటోంది. అయినప్పటికీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకా సమయం అవసరమని, అందుకే డిసెంబర్ 3 నుంచి రిలీజ్ వాయిదా పడుతున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఫౌజీ ఒక్కటే కాదు, ప్రభాస్ తదుపరి చిత్రాలైన ‘స్పిరిట్’, ‘సలార్ 2’ కూడా పోస్ట్‌పోన్ జాబితాలో చేరాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ‘స్పిరిట్’ చిత్రాన్ని ఇప్పటికే మార్చి 5, 2027 రిలీజ్ డేట్‌గా అనౌన్స్ చేశారు. ఒకవేళ ఫౌజి కనుక సమ్మర్ 2027 కి షిఫ్ట్ అయితే ఈ సినిమా కూడా పోస్ట్ ఫోన్ అయినట్టే
మొత్తంగా చూస్తే, ప్రభాస్ భారీ ప్రాజెక్టుల కోసం అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఫౌజీ, స్పిరిట్, సలార్ 2 – మూడు చిత్రాలు వరుసగా 2027, 2028 లో జరగడంతో, వచ్చే రెండు ఏళ్లు ప్రభాస్ అభిమానులకు పండగే పండగ అని చెప్పాలి. ఇవి ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న అప్‌డేట్స్ మాత్రమే. అధికారిక ప్రకటనల కోసం మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.