సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ నుండి ఈ వారం నాలుగు సినిమాలు రిలీజ్ కాదు రాబోయే వీక్ లో మరో మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి వాటిలో ఒకటి హ్యాపీ జర్నీ. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాని ఈ నెల 18న విడుదలకు సిద్ధం చేయడంతో ఈ సినిమా నుండి ఈరోజు ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.
ట్రైలర్ చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా తమ చివరి క్షణంలో కూడా హ్యాపీగా ఉండాలి అంటూ ట్రావెలింగ్ చేసే ఏడుగురు కదా అని అర్థమవుతుంది .. ఈ ట్రైలర్‌లో ఏడుగురు మహిళలను ఒకరికొకరు పూర్తిగా కలిసిపోయే వ్యక్తులుగా చూపించలేదు. వారు వేర్వేరు వయసులు, నేపథ్యాలు, అనుభవాలు కలిగి ఉండటంతో పాటు భిన్నమైన వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. దీంతో వారి యూరప్ ట్రిప్‌లో విభేదాలు, ఘర్షణలకు దారితీస్తుంది.
మొదట్లో ఈ ఏడుగురు తమ వెకేషన్‌ను ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే వారి మధ్య ఉన్న తేడాలు తరచూ వాగ్వాదాలకు, హాస్యభరితమైన పరిస్థితులకు కారణమవుతాయి. కానీ ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ వారి మధ్య సంబంధాలు మారడం మొదలవుతుంది. ఒకరి వ్యక్తిత్వం వెనుక దాగి ఉన్న విషయాలను మరొకరు తెలుసుకోవడంతో విభేదాలు క్రమంగా తగ్గి, పరస్పర అవగాహన మరియు స్నేహం పెరుగుతాయి.
దర్శకుడు అభిరామ్ నాయుడు సిట్యుయేషనల్ హ్యూమర్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలను మేళవిస్తూ, కథలోని ప్రధాన దృష్టిని ఈ ఏడుగురు మహిళలపైనే ఉంచారు. విజువల్ ప్రెజెంటేషన్ కూడా ట్రైలర్‌లో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ మణికందన్ సుబ్రమణియన్ యూరప్ లొకేషన్స్‌ను గ్రాండ్‌గా చూపించగా, శేఖర్ చంద్ర సంగీతం ప్రయాణ నేపథ్యానికి, భావోద్వేగ సన్నివేశాలకు చక్కగా సహకరిస్తుంది.
ట్రైలర్‌ను బట్టి చూస్తే హ్యాపీ జర్నీ కేవలం వెకేషన్‌కు సంబంధించిన కథ మాత్రమే కాదు. వ్యక్తిత్వాలు, బంధాలు, స్నేహం, అలాగే కలిసి ప్రయాణించే సమయంలో అపరిచితుల మధ్య ఏర్పడే అనుబంధాలను కూడా ఈ సినిమా explore చేస్తున్నట్లు కనిపిస్తోంది.