Chandrayaan Movie Trailer Review: రాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో “చంద్రయాన్” టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చంద్రయాన్ సినిమా ని శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన “చంద్రయాన్” (Chandrayaan Movie) సినిమా ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు “చంద్రయాన్” సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ ప్రపంచంలో కేవలం 5 దేశాలు మాత్రమే చంద్రుడి మీదకు తమ స్పేస్ క్రాఫ్ట్ లను పంపగలిగాయి. అలాంటి ప్రయత్నం మందమర్రి అనే చిన్న గ్రామంలో లెక్కలు, ఎక్కాలు రాని నలుగురు కుర్రాళ్లు చేస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ హ్యూమర్ ను సిల్వర్ స్క్రీన్ మీద చూపించబోతోంది “చంద్రయాన్” మూవీ. ఆ ఫన్ కు చిన్న శాంపిల్ ఇచ్చింది ట్రైలర్.

“చంద్రయాన్” (Chandrayaan) ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – గూగుల్ సాయంతో రాకెట్ తయారుచేసి చంద్రుడి మీదకు వెళ్లేందుకు నలుగురు కుర్రాళ్లు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ దెబ్బతో ఊరంతా తమ వైపు, ప్రపంచమంతా తమ ఊరి వైపు చూడాలనుకుంటారు. ఆ రాకెట్ లో ఇంధనం కోసం తవుడు, ఆ వాతావరణంలో బతుకుతుందో లేదో టెస్ట్ చేసేందుకు కోడిని అద్దెకు తీసుకొస్తారు.

సైన్స్ కే ట్విస్టులు ఇచ్చే ఈ సైంటిస్టులు చేసే రాకెట్ ప్రయోగం ఊరికి కీడుగా గ్రామస్థులు భావిస్తారు. ఈ క్రమంలో ఊరిలో హత్య కేసు ఉదంతం వెలుగులోకి రావడం, బాబా భాస్కర్ క్యారెక్టర్ ను పరిచయం చేయడం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఎవరూ తమ ప్రయత్నాన్ని నమ్మని, ప్రోత్సహించని పరిస్థితుల్లో తమకు దొరికిన వస్తువులతో ఈ నలుగురు కుర్రాళ్లు రాకెట్ ఎలా తయారుచేశారు? చంద్రయానం ఎలా చేశారు? అనే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు.నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే మూవీ లవర్స్ లోను అలాగే ఫాన్స్ లో భారీగానే అంచునను క్రియేట్ చేశాయి ట్రైలర్ టీజర్ అలాగే సాంగ్స్ మరియు రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ ని సృష్టిస్తుందో చూడాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టాయి మరి కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Chandrayaan Movie Trailer Released Ahead of Its November 13 Theatrical Release